logo

విధుల్లో నిర్లక్ష్యం.. లైన్‌మెన్‌కు జైలు

నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించి ఓ వ్యక్తి తీవ్ర గాయాలకు కారణమైన విద్యుత్తు శాఖ లైన్‌మెన్‌కు నిడమనూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి పురుషోత్తమరావు ఏడాది జైలు

Updated : 26 Jan 2022 04:53 IST

నిడమనూరు, న్యూస్‌టుడే: నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించి ఓ వ్యక్తి తీవ్ర గాయాలకు కారణమైన విద్యుత్తు శాఖ లైన్‌మెన్‌కు నిడమనూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి పురుషోత్తమరావు ఏడాది జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించారు. కోర్టు కానిస్టేబుల్‌ అలీ అహ్మద్‌ వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం సోమోరిగూడెం గ్రామానికి చెందిన సుంకరబోయిన రామలింగయ్య, 2014 ఆగస్టు 22న అనుముల మండలం అన్నారం గ్రామంలో ఓ రైతు పొలంలో విద్యుత్తు పనులు చేసేందుకు కాంట్రాక్టర్‌ వద్దకు కూలిగా వెళ్లారు. పనులు చేసే సమయంలో సదరు కాంట్రాక్టర్‌ విద్యుత్తు శాఖ లైన్‌మెన్‌కు ఫోన్‌ చేసి ఎల్‌సీ తీసుకున్నాడు. సాయంత్రం ఐదు గంటల సమయంలో విధుల్లో ఉన్న లైన్‌మెన్‌ ఎవరినీ సంప్రదించకుండానే విద్యుత్తు సరఫరా పునరుద్ధరించడంతో రామలింగయ్య విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితుడి తండ్రి లింగయ్య అదే రోజు హాలియా ఠాణాలో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై సురేష్‌కుమార్‌ కేసు నమోదు చేసి అభియోగపత్రాన్ని కోర్టుకు సమర్పించారు. మంగళవారం కేసును పరిశీలించిన జడ్జి లైన్‌మెన్‌ బ్రహ్మచారికి జైలుశిక్ష, జరిమానా విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని