logo

మహిళా సిబ్బందిపై వేధింపులు

జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రిలో మహిళా సిబ్బందిపై ఇటీవల వేధింపులు తీవ్రమవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం పారిశుద్ధ్య కార్మికురాలిని ఓ సూపర్‌ వైజర్‌ లైంగిక వేధింపులకు గురి చేయడంతో

Published : 26 Jan 2022 04:40 IST

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రిలో మహిళా సిబ్బందిపై ఇటీవల వేధింపులు తీవ్రమవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం పారిశుద్ధ్య కార్మికురాలిని ఓ సూపర్‌ వైజర్‌ లైంగిక వేధింపులకు గురి చేయడంతో సిబ్బంది జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. సంస్థ ఇన్‌ఛార్జికి ఫిర్యాదు చేయడంతో ఆయన్ను ప్రధాన కార్యాలయానికి రావాలని హైదరాబాద్‌ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇది మరవక ముందే తాజాగా డయాలసిస్‌ సెంటర్‌లో ఓ మహిళా ఉద్యోనికి అక్కడ పనిచేసే మరో ఉద్యోగి లైంగికంగా వేధింపులకు గురి చేయడంతో బాధితురాలు షీ టీమ్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. వేధింపులకు పాల్పడిన వీళ్లిఇద్దరు స్థానిక ప్రజాప్రతినిధి పేరు చెప్పుకొని ఆసుపత్రిలోనే తిరుగుతుండటంతో ఇతర మహిళా ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా విషయం ఇటీవల తన దృష్టికికూడా వచ్చిందన్నారు. వాస్తవాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని