logo

పేర్లు రాసి.. డబ్బులు కాజేసి..!

సెంటుభూమి లేని, కౌలు రైతులు కానివారి పేరిట వందలకొద్దీ ధాన్యం బస్తాలు ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో అమ్మినట్లు మిల్లర్లు సృష్టించి డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Published : 26 Jan 2022 04:40 IST

నిఘా విభాగం, న్యూస్‌టుడే: సెంటుభూమి లేని, కౌలు రైతులు కానివారి పేరిట వందలకొద్దీ ధాన్యం బస్తాలు ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో అమ్మినట్లు మిల్లర్లు సృష్టించి డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐకేపీ నిర్వాహకులు, మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై రూ.కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధికి మిల్లులు ఉండడం, అతని అనుచరుల పేరిట వందల బస్తాలు అమ్మినట్లు ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

మిల్లర్లు, అధికారులు, నిర్వాహకులు కుమ్మక్కై..

గడ్డిపల్లిలోని మిల్లర్లు పెన్‌పహాడ్‌ మండలంలోని ఓ గ్రామం ఐకేపీ నిర్వాహకులు, అధికారులతో కుమ్మక్కైయ్యారు. ఓ ప్రజాప్రతినిధి డ్రైవర్‌ పేరిట 898 బస్తాలు, గ్రామ సిబ్బంది ఒకరి పేరిట 506 బస్తాలు, భూమి లేని మహిళ- 449 బస్తాలు, కులవృత్తి చేసుకునే దంపతులు- 924 బస్తాలు, లారీ డ్రైవర్‌- 428 బస్తాలు, వాచర్‌- 450, వడ్రంగి- 420 బస్తాలు, 108 వాహన టెక్నీషియన్‌ పేరిట 467 బస్తాలు అమ్మినట్లు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో దస్త్రాలు సృష్టించారు. సదరు కొనుగోలు కేంద్రం ఉన్న గ్రామంలో ఓ కుటుంబంలో ముగ్గురి పేరిట సుమారు 1,000 ధాన్యం బస్తాలు కొన్నట్లు రాశారు. ధాన్యం కొనకున్నా మరో 15 మంది పేరిట వందల బస్తాలు రాసి డబ్బులు దండుకున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని