logo

నేటి నుంచి జాన్‌పహాడ్‌ ఉర్సు ఉత్సవాలు

మత సామరస్యాన్ని ప్రతీకైన జాన్‌పహాడ్‌ సైదన్న ఉర్సు ఉత్సవాలకు సిద్ధమైంది. ఉర్సు గురువారం ప్రారంభమై మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఉభయ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది

Published : 27 Jan 2022 03:50 IST

ముస్తాబైన జాన్‌పహాడ్‌ దర్గా

పాలకవీడు గ్రామీణం, న్యూస్‌టుడే: మత సామరస్యాన్ని ప్రతీకైన జాన్‌పహాడ్‌ సైదన్న ఉర్సు ఉత్సవాలకు సిద్ధమైంది. ఉర్సు గురువారం ప్రారంభమై మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఉభయ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నాయి. ఇస్లాం మతానికి చెందిన దర్గా అయినప్పటికి హిందువులు అధిక సంఖ్యలో హాజరవుతారు. హిందూ, ముస్లిం ఐక్యతకు చిహ్నంగా జాన్‌పహాడ్‌ దర్గా తెలుగు రాష్ట్రాల్లో పేరు గాంచింది. దర్గా ప్రాంగణంలో నాగమయ్య పుట్ట ఇందుకు తార్కాణంగా ప్రజలు చెబుతారు. సైదులు బాబాకు చాదర్‌ సమర్పించిన తర్వాత పుట్ట దగ్గర పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. కోరిన కోర్కెలు తీర్చే జాన్‌పహాడ్‌ సైదన్నగా భక్తులు పిలుచుకుంటారు.

గుసుల్‌ ఉత్సవాలతో ప్రారంభం.. ఉర్సు ఉత్సవాలు గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గుసుల్‌ కార్యక్రమంతో మొదలవుతాయి. బాబా సమాధిపైనున్న చాదర్‌లు, దట్టిలను తొలగించి శుభ్రపరిచి దీపారాధన చేసి వేడుకలను ప్రారంభిస్తారు. అనంతరం పవిత్ర గంధం సమాధులపై చల్లి  పూలతో చాదరు ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకు యువరాజు సైదులు బాబా సమాధులకు జల్సా ఈ సిరత్‌ అల్లా నమాజ్‌ నిర్వహిస్తారు. 8గంటల నుంచి భక్తులకు దర్గాలో ప్రవేశించి కల్పిస్తారు.

పవిత్ర గంధోత్సవం.. శుక్రవారం జరిగే పవిత్ర గంధోత్సవం ఉత్సవాల్లో కీలకం. హైదరాబాద్‌లోని నాంపల్లి దర్గాలోని చందనఖానా నుంచి ప్రత్యేక ఈద్‌ జుమాతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. గంధం పూర్వ జాన్‌పహాడ్‌ గ్రామంలోని వీధుల్లో ఊరేగింపు నిర్వహించి సాయంత్రం 3గంటలకు సైదులు బాబా సమాధుల పైకి గంధం ఎక్కించడం జరుగుతుంది. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతిస్తారు.

దీపారాధనతో ముగింపు.. శనివారం రోజు సాయంత్రం 6గంటలకు దీపారాధన కార్యక్రమంలో భాగంగా ఉర్సు ఉత్సవానికి ముగింపు పలుకుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని