logo

వివాహిత బలవన్మరణానికి కారణమైన హోంగార్డు అరెస్టు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు గ్రామంలో వివాహిత గన్నవరపు అనిత (35) బలవన్మరణానికి కారణమైన వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. చిల్లకల్లు ఎస్సై రమేష్‌ వివరాల

Published : 27 Jan 2022 03:50 IST

కోదాడ రూరల్‌, జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు గ్రామంలో వివాహిత గన్నవరపు అనిత (35) బలవన్మరణానికి కారణమైన వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. చిల్లకల్లు ఎస్సై రమేష్‌ వివరాల ప్రకారం.. ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం చేపట్టిన దర్యాప్తులో సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో హోంగార్డుగా పని చేస్తున్న బొలిశెట్టి వీరబాబు ఆమె మృతికి కారణమని తేలింది. ఈ మేరకు బుధవారం అతనిని అరెస్ట్‌ చేసినట్లు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

హోంగార్డుపై పలు ఆరోపణలు.. వివాహితను నగదు కోసం తీవ్రంగా వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. కాల్‌డేటా ప్రకారం తేల్చినట్లు సమాచారం. పోలీస్‌ శాఖను అడ్డం పెట్టుకుని కోదాడ ప్రాంతంలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇసుక అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరించినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులే అభిప్రాయపడుతున్నారు. ఇసుక దందాలో హోంగార్డుపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో 11 కేసులు నమోదయ్యాయి. ఓ కేసు విషయంలో గతంలో జిల్లా కేంద్రంలోని హెడ్‌క్వార్టర్స్‌ అటాచ్‌ చేశారు. కొన్ని కేసులను అడ్డదారుల్లో కొట్టివేయించుకున్నట్లు ఆరోపణలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు