logo

పెద్దగుట్టపై పేలుళ్లునిలిపేయాలంటూ ధర్నా

ఆత్మకూర్‌(ఎస్‌) పెద్దగుట్టపై భారీ శబ్దాలతో పేలుళ్లకు పాల్పడుతున్న కేఎస్‌ఎన్‌ఆర్‌ స్టోన్‌క్రషర్‌ మిల్లును తక్షణమే మూసేసి, పేలుళ్లను నిలిపేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు.

Published : 27 Jan 2022 03:50 IST

ఆత్మకూర్‌(ఎస్‌): ధర్నా చేస్తున్న అఖిలపక్షం నాయకులతో మాట్లాడుతున్న ఎస్సై యాదవేందర్‌రెడ్డి

ఆత్మకూర్‌(ఎస్‌), న్యూస్‌టుడే: ఆత్మకూర్‌(ఎస్‌) పెద్దగుట్టపై భారీ శబ్దాలతో పేలుళ్లకు పాల్పడుతున్న కేఎస్‌ఎన్‌ఆర్‌ స్టోన్‌క్రషర్‌ మిల్లును తక్షణమే మూసేసి, పేలుళ్లను నిలిపేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. స్టోన్‌క్రషర్‌ మిల్లు వద్ద ఆత్మకూర్‌(ఎస్‌)- నెమ్మికల్‌ రహదారిపై చేపట్టిన ధర్నా రెండు గంటల పాటు సాగింది. అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ఎనిమిది నెలలుగా పెద్దగుట్టపై పేలుళ్లను నిలిపేయాలని ఆందోళనలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. భారీ శబ్దాలతో నివాసాలు దెబ్బతింటున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ వచ్చే వరకు ధర్నా విరమించేదిలేదని నినాదాలు చేశారు. ఎస్సై యాదవేందర్‌రెడ్డి నచ్చజెప్పి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. డేగల వెంకటకృష్ణ, పందిరి మాధవరెడ్డి, తంగెళ్ల వీరారెడ్డి, తంగెళ్ల సైదిరెడ్డి, గంపల కరుణాకర్‌, పందిరి శ్రీనివాసరెడ్డి, గిలకత్తుల ఎల్లయ్య, గునిగంటి శ్రీను, పగిడి యల్లయ్య, విసవరం రాంరెడ్డి, పందిరి రాంగోపాల్‌రెడ్డి, పందిరి కృష్ణారెడ్డి, గడ్డం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని