logo

కదల్లేని దైన్యం.. కరుణించని వైనం

వేములపల్లి మండలం మంగాపురానికి చెందిన దివ్యాంగురాలు కొత్త జానకమ్మ ట్రై సైకిల్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఐదు నెలలుగా సంబంధిత కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు ఏమాత్రం కనికరించలేదు.

Published : 27 Jan 2022 03:50 IST

వేములపల్లి మండలం మంగాపురానికి చెందిన దివ్యాంగురాలు కొత్త జానకమ్మ ట్రై సైకిల్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఐదు నెలలుగా సంబంధిత కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు ఏమాత్రం కనికరించలేదు. తన సమస్య పట్టించుకోకపోవడంతో గణతంత్రదినోత్సవం రోజునైనా తనకు న్యాయం జరుగుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులకు తన బాధ  తెలియజెప్పేందుకు బుధవారం కలెక్టరేట్‌కు సోదరుడి సహాయంతో అష్టకష్టాలు పడుతూవచ్చారు. కానీ.. గణతంత్ర వేడుకలకు బందోబస్తుగా ఉన్న పోలీసులు ఆమెను లోపలకు పంపడానికి ససేమిరా అన్నారు. దీంతో గంటల కొద్ది ఆమె గేటు వద్దేనే దిగాలుగా కూర్చుండి పోయింది. ఆఖరుకు కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఏవో వచ్చి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు.

-ఈనాడు, నల్గొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని