logo

సమీపిస్తున్న గడువు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ మహాకుంభ సంప్రోక్షణకు ఇంకా రెండు నెలల గడువే ఉంది. మార్చి 28 ఆ మహాక్రతువును నిర్వహించనుండగా.. అంతకు ముందే పనులు పూర్తి చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో గుత్తేదారులు నిర్మాణాలను

Published : 28 Jan 2022 03:45 IST

యాదాద్రి వలయ రహదారి డివైడర్‌పై నాటిన పూలమొక్కలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ మహాకుంభ సంప్రోక్షణకు ఇంకా రెండు నెలల గడువే ఉంది. మార్చి 28 ఆ మహాక్రతువును నిర్వహించనుండగా.. అంతకు ముందే పనులు పూర్తి చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో గుత్తేదారులు నిర్మాణాలను వేగిరం చేశారు. సర్కారు సంకల్పానికి తోడుగా కూలీలు చకచక పనులు సాగిస్తున్నారు. కొండ కింద గండి చెరువు సుందరీకరణ, తూము నిర్మాణం, కలుషిత జలాలను తరలించే పైపు ఏర్పాటు పనులు, పాదబాట, లక్ష్మీ పుష్కరిణి సమీపంలో ఐదెకరాల విస్తీర్ణంలో చేపడుతున్న బస్టాండ్‌ నిర్మాణం, నాలుగు వరుసల రహదారి, పై వంతెనలు, విద్యుత్తు ఉపకేంద్రం, వ్రత మండపం, కల్యాణకట్టలో పెండింగ్‌ పనులు ఊపందుకున్నాయి. ఎక్కడ చూసినా అధికారులు, కూలీల హడావుడి కనిపిస్తోంది.

యాదగిరిగుట్ట బస్టాండ్‌ నిర్మాణ పనులు

సాగుతున్న గండి చెరువు తూము నిర్మాణం

గండి చెరువు సుందరీకరణలో భాగంగా చేపడుతున్న పాదబాట నిర్మాణం

-యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని