logo

కనువిందుగా స్తంభోద్భవుడి స్వరూపాలు

భక్త ప్రహ్లాదుడి రక్షణ కోసం స్తంభోద్భవుడైన మృగనరహరి.. మరో భక్తుడు యాదవ మహర్షి  తపఃఫలితంగా వెలసిన యాదాద్రిలో పునర్‌నిర్మితమైన ఆలయ సాలహారాల్లో శ్రీ స్వామి వివిధ రూపాల్లో భక్తులను అలరించనున్నారు. మహాదివ్యంగా

Published : 28 Jan 2022 03:45 IST

దశావతార రూపంలో నారసింహులు

భక్త ప్రహ్లాదుడి రక్షణ కోసం స్తంభోద్భవుడైన మృగనరహరి.. మరో భక్తుడు యాదవ మహర్షి  తపఃఫలితంగా వెలసిన యాదాద్రిలో పునర్‌నిర్మితమైన ఆలయ సాలహారాల్లో శ్రీ స్వామి వివిధ రూపాల్లో భక్తులను అలరించనున్నారు. మహాదివ్యంగా ఆలయ  దేవుడి రూపాలతో కూడిన  దశావతారాల విగ్రహాలు క్షేత్ర సందర్శకులకు  కనులవిందుగొల్పనున్నాయి. ఈ రూపాలు ఆలయ బయటి ఉత్తర దిశలోని  సాలహారాలలో పొందుపరిచారు. ఇక లోపలి సాలహారాల్లో హంస వాహనంపై శ్రీ లక్ష్మీనారసింహులు, శ్రీచక్రంలో యోగా సుదర్శన మూర్తి ముద్రలో శ్రీ నరసింహస్వామి రూపాలు సాదృశ్యం కానున్నాయి.

శ్రీచక్రంలో యోగ ముద్రలో నారసింహులు

హంసవాహనంపై శ్రీ లక్ష్మీనారసింహులు

శ్రీ నారసింహుడు

- యాదగిరిగుట్ట న్యూస్‌టుడే

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని