logo

రాజీవ్‌ స్వగృహాల విక్రయానికి కసరత్తు

నార్కట్‌పల్లి మండలం దాసరిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీవల్లి టౌన్‌ షిప్‌ ఓపెన్‌ ప్లాట్లు, గృహ నిర్మాణాలు విక్రయించేందుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి హెచ్‌.ఎం.డీ….ఏ ఆధ్వర్యంలో

Published : 28 Jan 2022 03:45 IST

రాజీవ్‌ స్వగృహ ఇళ్ల నిర్మాణాలు, ఓపెన్‌ ప్లాట్ల విక్రయానికి ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, అధికారులు

నల్గొండ కలెక్టరేట్‌, నార్కట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: నార్కట్‌పల్లి మండలం దాసరిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీవల్లి టౌన్‌ షిప్‌ ఓపెన్‌ ప్లాట్లు, గృహ నిర్మాణాలు విక్రయించేందుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి హెచ్‌.ఎం.డీ….ఏ ఆధ్వర్యంలో వేలం ద్వారా విక్రయించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నారు. గురువారం జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సంబంధిత అధికారులతో టౌన్‌షిప్‌ను సందర్శించారు. ప్లాట్లు వేలం ద్వారా విక్రయించేందుకు చదును చేసి, విభజించిన ప్లాట్లకు హద్దులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా నక్షా ప్రకారం క్షేత్ర స్థాయిలో ఓపెన్‌ ప్లాట్ల విస్తీర్ణం, క్రమ సంఖ్య ఉంచాలని, ప్రస్తుతం 4 బ్లాక్‌లో ఉన్న ప్లాట్లకు హద్దులు ఏర్పాటు చేయాలని సర్వే ల్యాంగ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాసులకు కలెక్టర్‌ చెప్పారు. శ్రీవల్లి టౌన్‌ షిప్‌లో 259 నిర్మాణం చేసిన గృహాలు, 574 ఓపెన్‌ ప్లాట్లు మొత్తం 833 ప్లాటింగ్‌ చేసి నంబరింగ్‌ చేయాలని వివరించారు. ఇందులో 4 బ్లాకుల్లో బృందాలను ఏర్పాటు చేయాలని ఒక్కో బృందంలో ఒక సర్వేయర్‌, హెల్పర్‌, ఇద్దరుముగ్గురు కూలీలను ఏర్పాటు చేసి వారం రోజుల్లో క్రమ సంఖ్య వారీగా పూర్తి చేయాలన్నారు. ఎంపీడీవో, తహసీల్దార్‌ ప్రతి రోజు సందర్శించి పనులు పర్యవేక్షించాలని సూచించారు. టౌన్‌ షిప్‌ నుంచి గ్రామానికి కలిపేలా రహదారులు ఏర్పాటు చేయాలన్నారు. టౌన్‌ షిప్‌లో సైట్‌ కార్యాలయం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం హెచ్‌.ఎం.డీ….ఏ ద్వారా ధర నిర్ణయించి పారదర్శకంగా ఈ- వేలం వేయనున్నట్లు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఈ ఆక్షన్‌ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. టౌన్‌ షిప్‌ సందర్శనలో పీఆర్‌ ఈఈ తిరుపతయ్య, డీ…ఈ నాగయ్య, తహసీల్దార్‌ నాగార్జున పాల్గొన్నారు.    
కార్యాలయాలు తరలించండి
నల్గొండ జిల్లాపరిషత్‌: నీటిపారుదలశాఖ కార్యాలయాలను పాత జడ్పీ భవనంలోకి మార్చే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం పాత జిల్లాపరిషత్తు కార్యాలయ భవనాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. నీటిపారుదలశాఖ కార్యాలయ సముదాయంలోని ఈఈ, డీఈ కార్యాలయాలను తక్షణమే జడ్పీకి తరలించాలని సూచించారు. అవసరమైన రంగులు, మౌలిక సౌకర్యాలు వారం రోజుల్లో ఏర్పాటు చేయాలని నీటిపారుదల, పంచాయతీరాజ్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నీటిపారుదలశాఖ ఈఈ సత్యనారాయణ, డీఈ భిక్షపతి, పంచాయతీరాజ్‌ ఈఈ తిరుపతయ్య, డీఈ నాగయ్య పాల్గొన్నారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని