logo

హక్కులు కాపాడటంలో చిత్తశుద్ధితో పని చేయాలి

ప్రజల హక్కులను కాపాడటంలో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య అన్నారు. భువనగిరిలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ

Published : 19 May 2022 02:49 IST

భువనగిరిలోని జిల్లా ఆసుపత్రిలో పర్యవేక్షణాధికారి చిన్న నాయక్‌తో సౌకర్యాల గురించి

మాట్లాడుతున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య

భువనగిరి గ్రామీణం: ప్రజల హక్కులను కాపాడటంలో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య అన్నారు. భువనగిరిలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాల సమీక్ష సమావేశంలో మాట్లాడారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు తమ శాఖల ద్వారా ప్రజలకు అందజేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజల హక్కులు ఉల్లంఘిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొనే అధికారం తమ శాఖకు ఉందని చెప్పారు. కాన్పు కోసం వచ్చిన గర్భిణులకు వైద్యులు సరైన అవగాహన కల్పించక పోవడం వల్ల 90శాతం ఆపరేషన్లు జరుగుతున్నాయన్నారు.ఆబ్కారీ శాఖకు సంబంధించి పది కేసుల పురోగతిని సంబంధిత అధికారులతో సమీక్షించారు. విద్యాశాఖ అధికారులతో మన ఊరు-మనబడి కార్యక్రమంపై సమీక్ష జరిపారు. మున్సిపాలిటీలలో చెత సేకరణ, పారిశుద్ధ్యం, మంచినీటి సౌకర్యంపై, దళిత బంధు పథకంపై, మహిళా శిశు సంక్షేమ శాఖ, తదితర శాఖల పనితీరుపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాల మర్రిలో జరుగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక సబ్‌ జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడారు. జైలు వద్ద నల్గొండ సబ్‌ జైలు అధికారి విజయ డాని, భువనగిరి సబ్‌ జైలు పర్యవేక్షణాధికారి పూర్ణచందర్‌, పీడీఎం అనిల్‌కుమార్‌ స్వాగతం పల్లికారు. జైలు ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. ఆ తర్వాత జిల్లా కేంద్రాసుపత్రిని తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. సౌకర్యాలపై ఆరా తీశారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. బస్వాపురం నిర్వాసితులు పరిహారం చెల్లించాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి నాగేశ్వర్‌రావు, డీసీపీ నారాయణరెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు