logo

అందుబాటులోకి అత్యవసర వైద్యం

మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలో ప్రభుత్వం ‘ట్రామా కేర్‌ యూనిట్‌’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవల మంత్రి హరీష్‌రావు ప్రకటించిన ట్రామా కేర్‌ సెంటర్‌ కేంద్రాల్లో మిర్యాలగూడ ఆసుపత్రి ఉంది. వాహనాలు అదుపుతప్పి ప్రమాదాల బారిన

Published : 19 May 2022 02:49 IST

మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో ట్రామా కేర్‌ యూనిట్‌


మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రి

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలో ప్రభుత్వం ‘ట్రామా కేర్‌ యూనిట్‌’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవల మంత్రి హరీష్‌రావు ప్రకటించిన ట్రామా కేర్‌ సెంటర్‌ కేంద్రాల్లో మిర్యాలగూడ ఆసుపత్రి ఉంది. వాహనాలు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడిన వారికి తలకు బలమైన గాయాలు అయితే వారికి అత్యవసర వైద్యం సరైన రీతిలో అందించేలా ఈ ట్రామా కేర్‌ సెంటర్‌ ఉపయోగపడుతుంది. కాళ్లు, చేతులు తెగిపోయిన సందర్భాల్లో రక్తస్రావం జరిగి ప్రాణాలు పోతుండగా ట్రామా కేర్‌ సెంటర్‌లో అత్యవసర వైద్యం అందించనున్నారు. మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రి అత్యవసర విభాగంలో ఓ గదిని పూర్తిగా ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు నిర్ణయించారు.  ‘అత్యవసర సమయాల్లో హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు వంటి పట్టణాలకు తరలిస్తే అక్కడి కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో రోజుకు రూ.50 వేల నుంచి లక్ష వరకు వ్యయం చేయాల్సిన దుస్థితి ఉండగా, ట్రామా కేర్‌ సెంటర్‌తో నిరుపేదలకు మేలు చేకూరనుంది.’
ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలు
కోదాడ - జడ్చర్ల జాతీయ రహదారి, అద్దంకి - నార్కట్‌పల్లి ప్రధాన రహదారి, భీమారం - సూర్యాపేట రహదారి
ట్రామాకేర్‌కు గది కేటాయించాము
డాక్టర్‌ శ్రీనివాస సమరథ్‌, సూపరింటెండ్‌

మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రికి ట్రామాకేర్‌ సెంటర్‌ కేటాయించినట్లు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈమేరకు ఆసుపత్రిలో ప్రత్యేకంగా గదిని కేటాయించాము. ప్రభుత్వం నుంచి అత్యవసర వైద్య పరికరాలు వస్తే అమర్చి అత్యవసర రోగులకు తగిన వైద్య చికిత్స అందిస్తాము.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని