logo

మియావాకి వనం.. నిండు ఆహ్లాదం

నాగార్జునసాగర్‌ రేంజ్‌ పరిధిలోని నెల్లికల్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో యాదాద్రి మోడల్‌ న్యాచురల్‌ ఫారెస్ట్‌ తరహాలో మియావాకి వనాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రూ.కోటిన్నర అంచనాతో ఈ పనులు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే రోడ్లు, వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశారు.

Published : 19 May 2022 02:49 IST

ఆర్‌ ఎస్‌ లో సందర్శన కోసం ఏర్పాటు చేసింది వ్యూ పాయింట్‌

నాగార్జునసాగర్‌ రేంజ్‌ పరిధిలోని నెల్లికల్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో యాదాద్రి మోడల్‌ న్యాచురల్‌ ఫారెస్ట్‌ తరహాలో మియావాకి వనాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రూ.కోటిన్నర అంచనాతో ఈ పనులు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే రోడ్లు, వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశారు. దాదాపుగా 22 రకాలతో నాలుగు వేల మొక్కలు నాటారు. సందర్శకుల కోసం వ్యూ పాయింట్‌తో పాటు సేదతీరడానికి ప్రత్యేక నిర్మాణాలు ఏర్పాటు చేశారు. ఈ పార్కును త్వరలో సందర్శకులకు అందుబాటులోకి తెస్తామని ఫారెస్ట్‌ అధికారులు తెలిపారు. నెల్లికల్‌ రిజర్వ్‌ ఫారెస్టు చుట్టూ ప్రహరీ, ఇనుప కంచెలు కట్టి ఆక్రమణలకు తావు లేకుండా చేస్తూనే పెద్దసంఖ్యలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

నెల్లికల్‌ ఫారెస్ట్‌లో మియావాకి వనం వివరాలు తెలిపే బోర్డు  

సిద్ధమైన ఫారెస్ట్‌ ముఖద్వారం

   - ఈనాడు, నల్గొండ

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని