logo

మాయరోగానికి మానవత్వమే మందు!

అసలే వారిది పేద కుటుంబం. ఆపై మరో ఆపద వచ్చి పడింది. నలుగురు సంతానంలో ఒకరికి బ్లడ్‌ క్యాన్సర్‌. వైద్యం నిమిత్తం ఆసుపత్రి ఖర్చులు కూడా భరించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం, దాతల సాయం కోరుతోంది ఈ బాధిత కుటుంబం.  

Published : 19 May 2022 02:49 IST

నందికొండ, తిరుమలగిరి (సాగర్‌), న్యూస్‌టుడే

తల్లిదండ్రులతో ఆంగోతు రమ్య

అసలే వారిది పేద కుటుంబం. ఆపై మరో ఆపద వచ్చి పడింది. నలుగురు సంతానంలో ఒకరికి బ్లడ్‌ క్యాన్సర్‌. వైద్యం నిమిత్తం ఆసుపత్రి ఖర్చులు కూడా భరించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం, దాతల సాయం కోరుతోంది ఈ బాధిత కుటుంబం.  
శస్త్రచికిత్సే శాశ్వత పరిష్కారం
నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్‌) మండలం రంగుండ్ల గ్రామానికి చెందిన ఆంగోతు స్వామి, శారద దంపతులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరి నలుగురి సంతానంలో పదమూడేళ్ల రమ్య, లక్ష్మణ్‌ కవల పిల్లలు. గతేడాది నుంచి రమ్య బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ప్రస్తుతం రమ్య హైదారాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రెండు రోజుల క్రితం కీమోథెరపీ శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కొంత ఉపశమనం కలిగించారు వైద్యులు. అయితే రమ్యకు శాశ్వత పరిష్కారంగా బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స చేయాలని.. ఔషధాలు, ఇతర వైద్య ఖర్చులు కలిపి రూ.15 లక్షల వరకూ అవసరం అవుతాయని వైద్యులు సూచించినట్లు రమ్య తండ్రి స్వామి తెలిపారు. ఇప్పటికే ఆసుపత్రిలోని యువరాజ్‌సింగ్‌ ఫౌండేషన్‌ ద్వారా రూ.3 లక్షల వరకు ఆర్థిక సాయం అందినా.. మిగతా డబ్బులు సమకూర్చలేకపోవడంతో రమ్య ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రూ.5 లక్షల వరకు అప్పులయ్యాయని.. ప్రభుత్వం గానీ, దాతలు గానీ ఈ ఆపద సమయంలో అండగా నిలిచి తమ కుమార్తె ప్రాణాలు నిలపాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.    

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని