logo

భువనగిరి బాలుడు... సింగరాయకొండలో దొరికాడు

అపహరణకు గురైన బాలుడు నెల రోజుల తర్వాత అనూహ్యంగా దొరికాడు. సీఐ లక్ష్మణ్‌, ఎస్సై సంపత్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మూటగుంటపాడు పరిధిలోని పొనుగోటివారిపాలేనికి చెందిన గద్దల మహేష్‌,

Published : 19 May 2022 02:49 IST

బాలుడితో పోలీసులు

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: అపహరణకు గురైన బాలుడు నెల రోజుల తర్వాత అనూహ్యంగా దొరికాడు. సీఐ లక్ష్మణ్‌, ఎస్సై సంపత్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మూటగుంటపాడు పరిధిలోని పొనుగోటివారిపాలేనికి చెందిన గద్దల మహేష్‌, శోభన దంపతులు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా భువనగిరి ప్రాంతంలో బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే అక్కడే నివసిస్తున్న జనగామ మండలానికి చెందిన కామర్ల లింగయ్య, సుజాత దంపతుల కుమారుడిని గత నెల 15న అపహరించి పొనుగోటివారిపాలెం తీసుకొచ్చారు. బుధవారం రాత్రి తిరిగి బేల్దారీ పనుల కోసం భువనగిరి బయలుదేరే క్రమంలో తాము వచ్చే వరకు బాలుడిని చూసుకోవాలని మహేష్‌ తన సోదరుడిని కోరగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ఘర్షణకు దారితీయడంతో స్థానికులు 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సిబ్బంది వచ్చి బాలుడిని, నిందితులను స్థానిక స్టేషన్‌కు తరలించి విచారించారు. ఈ క్రమంలో సదరు బాలుడు అపహరణకు గురైన చిన్నారిగా గుర్తించి అతని తలిదండ్రులకు, భువనగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని