logo

20న కోదాడకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

జనసేన కార్యకర్తలను  పరామర్శించేందుకు ఈనెల 20వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లాకు జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ రానున్నట్లు ఆ పార్టీ నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జి మేకల సతీష్‌రెడ్డి తెలిపారు.

Published : 19 May 2022 02:49 IST

కోదాడ పట్టణం, న్యూస్‌టుడే: జనసేన కార్యకర్తలను  పరామర్శించేందుకు ఈనెల 20వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లాకు జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ రానున్నట్లు ఆ పార్టీ నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జి మేకల సతీష్‌రెడ్డి తెలిపారు. కోదాడలో పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయ సమీపంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ నుంచి రహదారి మార్గంలో వెళ్తూ మార్గమధ్యలో యాదాద్రి భునవగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆగుతారని, కోదాడలో పార్టీ కార్యకర్త శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని కార్యకర్లకు పిలుపునిచ్చారు. సమావేశంలో నియోజకవర్గ అధ్యక్షుడు కుడుముల ప్రశాంత్‌, జనసేన కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్‌: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ నెల 20(శుక్రవారం)న చౌటుప్పల్‌ మండలం లక్కారంలో పర్యటించనున్నారు. జనసేన కార్యకర్త కొంగరి సైదులు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇందుకు సంబంధించి చౌటుప్పల్‌లో జనసేన కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. వలిగొండ మండలం గోపరాజుపల్లికి చెందిన పార్టీ కార్యకర్త సైదులు రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించారు. అతని భార్య, పిల్లలను పరామర్శించేందుకు పవన్‌కల్యాణ్‌ రానున్నారు. ఇక్కడి నుంచి హుజూర్‌నగర్‌కు చెందిన జన సైనికుడు కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని కోదాడలో పరామర్శించి చెక్కు అందజేయనున్నారు. లక్కారం గ్రామాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన ఇన్‌ఛార్జి మేకల సతీష్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి గురువారం రాత్రి సందర్శించారు. ఇక్కడి జనసేన కార్యకర్తలతో పర్యటన ఏర్పాట్లపై చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని