logo

కొనసాగుతున్న భూసేకరణ ప్రక్రియ

రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ ప్రక్రియ జిల్లాలో వేగంగా సాగుతోంది. అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి భూసేకరణ అధికారిగా యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లోని ఏడు గ్రామాల్లో భూసేకరణ నిర్వహిస్తున్నారు. 3ఏ నోటిఫికేషన్‌ను యాదగిరిగుట్ట

Published : 19 May 2022 02:49 IST

తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో మూడు అభ్యంతరాలు

భువనగిరి, న్యూస్‌టుడే రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ ప్రక్రియ జిల్లాలో వేగంగా సాగుతోంది. అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి భూసేకరణ అధికారిగా యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లోని ఏడు గ్రామాల్లో భూసేకరణ నిర్వహిస్తున్నారు. 3ఏ నోటిఫికేషన్‌ను యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లి, మల్లాపూర్‌, తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్‌, కోనాపూర్‌, దత్తాయపల్లి, వీరారెడ్డిపల్లి, వేల్‌పల్లి, ఇబ్రహీంపూర్‌కు సంబంధించి 3ఏ నోటిఫికేషన్‌ జారీ చేసి అభ్యంతరాలను కూడా స్వీకరించారు. అభ్యంతరాల స్వీకరణకు ఈనెల 13తో గడువు ముగియగా మూడు అభ్యంతరాలు వచ్చాయి. వీరారెడ్డిపల్లిలో భూముల మధ్య నుంచి రోడ్డు పోతున్నందున తీవ్రంగా నష్టపోతున్నామని ఐదుగురు రైతులు అభ్యంతరం తెలిపారు. అడవుల నుంచి రోడ్డు వేయడం వలన పర్యావరణం దెబ్బతింటుందని హైదరాబాద్‌కు చెందిన కిరణ్‌ మరో పిటిషన్‌ వేశారు. అలైన్‌మెంట్‌ ప్రక్రియనే సరిగా లేదని మరో వ్యక్తి అభ్యంతరం తెలిపారు. వచ్చిన మూడు అభ్యంతరాలను ఎన్‌హెచ్‌ అధికారులకు పంపించారు. త్వరలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి వారి వాదనలు వినేందుకు నోటీసులు జారీ చేయనున్నారు.

వలిగొండ, రామన్నపేట మండలాల్లో 3ఏ నోటిఫికేషన్‌ నాలుగు రోజుల క్రితం జారీ చేశారు. 21 రోజుల్లో అభ్యంతరాలను భూసేకరణ అధికారి చౌటుప్పల్‌ ఆర్డీవో సమర్పించాల్సి ఉంటుంది. భువనగిరి మండలానికి సంబంధించిన 3ఏ నోటిఫికేషన్‌ రెండు, మూడు రోజుల్లో విడుదలయ్యే అవకాశముందని అధికారి ఒకరు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని