logo

పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు చౌటుప్పల్‌లో జన సైనికులు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్కారంలో జాతీయ రహదారి పక్కనున్న ఇంటి వద్ద పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం ఆగి

Published : 20 May 2022 02:51 IST

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు చౌటుప్పల్‌లో జన సైనికులు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్కారంలో జాతీయ రహదారి పక్కనున్న ఇంటి వద్ద పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం ఆగి వలిగొండ మండలం గోపరాజుపల్లికి చెందిన కొంగరి సైదులు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. రూ.5లక్షల విలువైన చెక్కును అందజేయనుండడంతో అక్కడ వేదికను సిద్ధం చేస్తున్నారు. చౌటుప్పల్‌తో పాటు జాతీయ రహదారి పొడవునా పవన్‌ కల్యాణ్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. కోదాడలో కార్యకర్త శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని