logo

కుటుంబ కలహాలతో ఇద్దరు మహిళల బలవన్మరణం

కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన వివాహిత బలవన్మరణానికి పాల్పడిన మోదిన్‌పురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వానరాసి

Published : 20 May 2022 02:51 IST

దంతాల సౌజన్య

చివ్వెంల, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన వివాహిత బలవన్మరణానికి పాల్పడిన మోదిన్‌పురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వానరాసి మత్య్సగిరి, సోదరుడు నర్సింహ కలిసి బొగ్గుబట్టి వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపారంలో నష్టపోయిన మత్య్సగిరి అప్పుల పాలయ్యారు. అప్పుల విషయంలో మత్య్సగిరి తన భార్య వెంకటమ్మ(30)తో తరచూ గొడవ పడేవారు. ఈ నెల 18న సైతం భార్యాభర్తలు గొడవపడ్డారు. మనస్తాపం చెందిన వెంకటమ్మ ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. భర్త, పిల్లలు చూసి చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె గురువారం మృతిచెందారు. మృతురాలికి ఇద్దురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతురాలి తండ్రి మోతె వీరప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై వెంకన్న తెలిపారు.

కోదాడ: ప్రేమ వివాహం చేసుకొని అన్యోన్యంగా ఉండాల్సిన దంపతులు మనస్పర్థలు, కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన దంతాల సందీప్‌, చిలుకూరు మండలం బేతవోలుకు చెందిన సౌజన్య 2016లో ప్రేమ వివాహాం చేసుకున్నారు. వారికి కుమార్తె రేణుక, కుమారుడు అకీరా ఉన్నారు. కొన్నాళ్ల వరకు వారి జీవితం అన్యోన్యంగా సాగింది. ఇటీవల దంపతుల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా గొడవలు జరుగుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఇరువర్గాల కుటుంబ పెద్దలు కోదాడకు వచ్చి గొడవల విషయంపై మాట్లాతున్నారు. ఇంతలోనే సౌజన్య ఇంట్లోని మరో గదిలోకి వెళ్లి ఉరేసుకొని మరణించింది. తమ కూతురి వేధింపులకు గురిచేయడంతోనే ఆత్మహత్య చేసుకుందని సౌజన్య తల్లిదండ్రులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పట్టణ ఎస్‌ఐ రాంబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని