logo

స్త్రీనిధి రుణాలకు బీమా రక్ష

గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా చేర్చి వారికి ఆర్థిక రుణాలు మంజూరు చేయడంతో పాటు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో స్త్రీనిధి పాత్ర కీలకం.

Published : 20 May 2022 02:51 IST

తిప్పర్తిలో సౌభాగ్య పథకం ద్వారా రుణం పొంది కూరగాయల వ్యాపారం

నిర్వహిస్తున్న ఎస్‌ఎస్‌జీ సభ్యురాలు మాధవి

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా చేర్చి వారికి ఆర్థిక రుణాలు మంజూరు చేయడంతో పాటు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో స్త్రీనిధి పాత్ర కీలకం. సభ్యుల పనితీరును బట్టి నాలుగు రకాల పథకాలు అమలు చేస్తున్నారు. వీటితో పాటు బీమా సౌకర్యాన్ని సైతం వర్తింపజేస్తున్నారు. ఇప్పటికే డ్వాక్రా సంఘాల పనితీరును బట్టి వారికి గ్రేడింగ్‌ కేటాయిస్తున్న ఐకేపీ అధికారులు సభ్యుల పనితీరును నిశితంగా పరిశీలిస్తూ వ్యక్తిగత రుణాలు మంజూరు చేస్తున్నారు. మొదట వారి వ్యాపారం, అవసరమయ్యే పెట్టుబడిని అంచనా వేస్తారు. గతంలో తీసుకున్న రుణం చెల్లించిన విధానాన్ని బేరీజు వేసుకొని కొత్తగా ఎంతవరకు మంజూరు చేయవచ్చో నిర్ణయిస్తారు. వారి పనితీరు, ఎంపిక చేసుకున్న వ్యాపారాన్ని బట్టి సువిధ, ప్రగతి, అక్షయ, సౌభాగ్య పథకాల ద్వారా కనిష్ఠంగా రూ.40 వేలు.. గరిష్ఠంగా రూ. 3 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు.

రెట్టింపు లాభాలు.. స్వయం ఉపాధి కోసం తీసుకునే రుణ మొత్తం ఆధారంగా ప్రత్యేక సురక్షా బీమా అమలు చేస్తున్నారు. రుణగ్రహీత దురదృష్టవశాత్తు మరణిస్తే మిగులు రుణం కుటుంబ, ఇతర సభ్యులపై వేయకుండా పూర్తిగా మాఫీ చేస్తారు. దీంతోపాటు అప్పటి వరకు చెల్లించిన వాయిదాల మొత్తాన్ని సైతం బాధిత కుటుంబానికి తిరిగి ఇచ్చేస్తారు. ఈ బీమా కోసం సభ్యురాలు తీసుకున్న ప్రతి రూ.వెయ్యికి రూ.2.30 చొప్పున రుణ మొత్తానికి విలువకట్టి ప్రీమియం నిర్ణయిస్తారు. ఈ ప్రీమియాన్ని సైతం రుణంగానే అందించడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని