logo

ఖాళీ ప్లాట్లతో పాట్లు

భవిష్యత్తు అవసరాలకు జిల్లాలో చాలామంది ప్లాట్లను కొనుగోలు చేశారు. వాటి నిర్వహణ విషయంలో కనీస చర్యలు తీసుకోవడం లేదు. అందుకే ఖాళీ ప్లాట్లు మురుగు

Updated : 20 May 2022 02:56 IST

ఇది సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డు పక్కన ఖాళీ ప్లాట్‌. ఇందులో నీరు నిలిచి దుర్వాసన వ్యాపించటంతో చుట్టపక్కల ఇళ్లవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమలు, ఈగలు వృద్ధి చెంది రోగాల బారిన పడే ప్రమాదముందని భయాందోళన చెందుతున్నారు.


సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే: భవిష్యత్తు అవసరాలకు జిల్లాలో చాలామంది ప్లాట్లను కొనుగోలు చేశారు. వాటి నిర్వహణ విషయంలో కనీస చర్యలు తీసుకోవడం లేదు. అందుకే ఖాళీ ప్లాట్లు మురుగు కూపాలుగా మారుతున్నాయి. సూర్యాపేట, తిరుమలగిరి, నేరేడుచర్ల, కోదాడ, హుజూర్‌నగర్‌ పురపాలికల్లో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. కొందరు నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన ప్లాట్లు ఏర్పాటు చేస్తూ విక్రయిస్తున్నారు. గతంలో ఉన్న కాలనీలతోపాటు కొత్తగా ఏర్పడిన వాటిలో ఖాళ్లీ ప్లాట్లతో స్థానికులు సతమతమవుతున్నారు. జిల్లాలోని ఐదు పురపాలికల్లో 45 ప్రాంతాల్లో ఈ సమస్య నెలకొంది.

కొరవడిన పర్యవేక్షణ

యజమానులు తమ ప్లాట్లలో మురుగు, వర్షం నీరు నిలవకుండా, పిచ్చిమొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలి. అధికారులూ పర్యవేక్షించాలి. కానీ కొందరు ప్లాట్లను కొని రిజిస్ట్రేషన్‌ చేయించుకొని వదిలేస్తున్నారు. చెత్తాచెదారం పేరుకుపోయి, డ్రైనేజీ నీరు చేరటంతో కొన్ని ఖాళీ ప్లాట్లు మురుగు కూపాలుగా మారుతున్నాయి. సంబంధిత యజమానులకు అధికారులు అడపాదడపా నోటీసులు జారీ చేస్తున్నారు. కొందరి వివరాలు తెలియక నోటీసులు ఇవ్వటం లేదు. ఖాళీ స్థలం పన్ను (వీఎల్‌టీ)ని యజమానులు చెల్లించాల్సి ఉంటుంది. డాక్యుమెంట్‌ విలువలో 0.5 శాతం పన్ను కట్టాలి. ఈ విషయంలోనూ కొందరు యజమానులు వెనుకడుగు వేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం: రామాంజులరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, సూర్యాపేట

నిబంధనలు పాటించని ఖాళీ ప్లాట్ల యజమానులపై చర్యలు తీసుకుంటాం. మురుగునీరు నిలవకుండా, పిచ్చిమొక్కలు మొలవకుండా యజమానులు చూసుకోవాలి. వీఎల్‌టీ వసూలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని