logo

స్థలాల సేకరణ పూర్తి చేయాలి: కలెక్టర్‌

గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలకు అనువైన స్థలాల సేకరణ రెండ్రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి రెవెన్యూ పంచాయతీ అధికారులను ఆదేశించారు.

Published : 20 May 2022 02:51 IST

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలా సత్పతి, చిత్రంలో అదనపు కలెక్టర్లు

శ్రీనివాస్‌రెడ్డి, దీపక్‌ తివారి

భువనగిరి, న్యూస్‌టుడే: గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలకు అనువైన స్థలాల సేకరణ రెండ్రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి రెవెన్యూ పంచాయతీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, ఉపాధిహామీ అధికారులతో గురువారం సమీక్షించారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు అనువుగా ఎకరం లేదా ఎకరన్నర స్థల సేకరణ చేపట్టాలని సూచించారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో భాగంగా 55 చోట్ల స్థలాల సేకరణ రెండ్రోజుల్లో పూర్తి చేయాలన్నారు. రాబోయే 8వ విడత హరితహారంలో మొక్కలు నాటేందుకు గుర్తించిన స్థలాల్లో గుంతలు తీయడం, అవెన్యూ ప్లాంటేషన్లలో మల్టీ లేయర్‌ మూడు వరుసల్లో మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలన్నారు. వైకుంఠధామాలకు విద్యుత్‌, నీటి సరఫరా ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని, సెగ్రిగేషన్‌ షెడ్స్‌ పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలన్నారు.

స్త్రీనిధి రుణాల్లో 92 శాతం ప్రగతి

భువనగిరి: గ్రామీణ స్త్రీనిధి రుణాలకు సంబంధించి 92శాతం ప్రగతి సాధించినట్లు కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. కలెక్టరేట్‌లో స్త్రీనిధి యాప్‌ను గురువారం ప్రారంభించారు. 2021-22 సంవత్సరంలో స్త్రీనిధి రుణాల కింద రూ.105.85 కోట్లకు గాను రూ.98.10 కోట్లు అందించి 92శాతం ప్రగతి సాధించామన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రుణ ప్రణాళిక రూ.127.71 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, డీపీవో సునంద పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని