logo

బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి రాజీవ్‌గాంధీ

దేశానికి సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన ఘనత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీకే దక్కుతుందని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ అన్నారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం నల్గొండ పట్టణంలోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు

Published : 22 May 2022 03:59 IST

రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి 

నల్గొండ జిల్లాపరిషత్‌, న్యూస్‌టుడే: దేశానికి సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన ఘనత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీకే దక్కుతుందని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ అన్నారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం నల్గొండ పట్టణంలోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఉపధ్యాక్షుడు పరమేష్‌, కౌన్సిలర్లు వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌, శంకర్‌, బాబా, సమద్‌, శంకర్‌, సుభాష్‌ యాదవ్‌, నాగరాజు, సైదిరెడ్డి రవి, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్‌ సేవలు మరువలేనివి: జానారెడ్డి
త్రిపురారం, న్యూస్‌టుడే: దేశానికి రాజీవ్‌ గాంధీ చేసిన సేవలు మరువలేనివని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. శనివారం త్రిపురారం మండల కేంద్రంలో రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా పండ్లు పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, ఎంపీపీ అనుముల పాండమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు ధనావత్‌ భారతి, భాస్కర్‌నాయక్‌, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, బిట్టు రవి, నరేష్‌, చిలుముల శ్రీను, రవితదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో విభేదాలు..!
మిర్యాలగూడ పట్టణం: రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గుమన్నాయి. ఇటీవల డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, పురపాలిక ఫ్లోర్‌ లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డిలు విడివిడిగా కార్యక్రమాలు చేస్తున్నారు. శనివారం పట్టణంలో ఉదయం 10 గంటలకు నిర్వహించే వర్ధంతి కార్యక్రమానికి సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి హాజరు కానున్నారని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ ఒక రోజు ముందే ప్రకటించారు. అయితే పురపాలిక ఫ్లోర్‌లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి తన వర్గం నాయకులతో కలిసి ఉదయం 8.30గంటలకే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.  పట్టణానికి రావాల్సిన జానారెడ్డి నేరుగా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారు. అక్కడ సైతం బీఎల్‌ఆర్‌ వర్గం అప్పటికే కార్యక్రమం ముగించడంతో..జానారెడ్డి వేరే కార్యక్రమంలో పాల్గొని వెనుదిరిగినట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని