logo

సహజ కాన్పులతో తల్లీబిడ్డ క్షేమం: కలెక్టర్‌

ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలకు బదులు సర్కారు దవాఖానాల్లో సహజ కాన్పులు చేయించుకుంటే తల్లీబిడ్డ క్షేమంగా ఉంటారని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు.

Published : 22 May 2022 03:59 IST

లక్ష్మీతండాలో  మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

బొమ్మలరామారం, న్యూస్‌టుడే: ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలకు బదులు సర్కారు దవాఖానాల్లో సహజ కాన్పులు చేయించుకుంటే తల్లీబిడ్డ క్షేమంగా ఉంటారని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. మండలంలోని లక్ష్మీతండా గ్రామంలో శనివారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నత చదువు చదివి.. మంచి అనుభవం గల వైద్యులు అందుబాటులో ఉంటారని, వారు ఎక్కువ శాతం సహజ కాన్పులు చేస్తారని చెప్పారు. భృణ హత్యలు చేయడం, పిల్లల విక్రయం, బాల్య వివాహాలు చేయడం నేరమని శిక్ష తప్పదని హెచ్చరించారు. సదస్సులో తహసీల్దార్‌ పద్మసుందరి, జిల్లా ఉపవైద్యాధికారిణి యశోద, మండల వైద్యాధికారులు క్రాంతి, క్రాంతికుమార్‌, సర్పంచి ధీరావతు మంజుల, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మర్యాల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. ధాన్యం అధిక తూకం వేయవద్దని, రైతులకు మంచినీరు, నీడ, కరెంటు సౌకర్యం కల్పించాలని సూచించారు.    
భువనగిరి: వచ్చే వానాకాలం సీజన్‌లో రైతు వేదికల్లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సాగు, నూతన సాంకేతిక పద్ధతులు వివరించి రైతులు అధిక దిగుబడులు పొందేలా సన్నద్ధం చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి వ్యవసాయ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో  ఏడీఏలు, మండల అధికారులు, విస్తరణ అధికారులతో శనివారం సమీక్షించారు. వరి సాగులో వెదజల్లే పద్ధతిని రైతులకు వివరించాలని సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, జిల్లా వ్యవసాయ అధికారిణి అనురాధ తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు