logo

వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం: మంత్రి

వైద్యరంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని జనరల్‌ ఆసుపత్రిలో నూతన డైట్‌ పాలసీని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు

Published : 22 May 2022 03:59 IST

ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందితో సమీక్ష జరుపుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, చిత్రంలో కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, వైద్యులు

తాళ్లగడ్డ(సూర్యాపేట), న్యూస్‌టుడే: వైద్యరంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని జనరల్‌ ఆసుపత్రిలో నూతన డైట్‌ పాలసీని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో అధునాతన పరికరాలు అందించామని, వైద్యులు ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలన్నారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ కేసులు ఎక్కువగా పెంచాలని, ఆసుపత్రికొచ్చే వ్యాధిగ్రస్థులతో సానుకూలతతో వైద్యసిబ్బంది మెలగాలని సూచించారు. వివిధ విభాగాల ద్వారా అందిస్తున్న సేవలను కలెక్టర్‌తో కలిసి మంత్రి సమీక్షించారు. అనంతరం టి.హబ్‌, వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మాణాల కోసం స్థల పరిశీలన చేశారు. ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ మురళీధర్‌రెడ్డి, వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ శారద, వివిధ విభాగాల వైద్యులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు