logo

దారి దోపిడీ

పల్నాడు జిల్లాలో రెండు దారి దోపిడీ ఘటనలు కలకలం రేపాయి. బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని సిమెంట్‌ కంపెనీలో మిల్లర్‌గా పని చేస్తున్న గొల్ల రామకృష్ణ, భారతి దంపతులు....

Published : 24 May 2022 03:51 IST


నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతి

నకరికల్లు, సత్తెనపల్లి, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లాలో రెండు దారి దోపిడీ ఘటనలు కలకలం రేపాయి. బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని సిమెంట్‌ కంపెనీలో మిల్లర్‌గా పని చేస్తున్న గొల్ల రామకృష్ణ, భారతి దంపతులు నంద్యాల జిల్లా వెలిగోడు మండలం రేగడిగూడురులో పెళ్లికి హాజరయ్యారు. అక్కడి నుంచి రైలులో వచ్చి నరసరావుపేట రైల్వేస్టేషన్‌లో సోమవారం తెల్లవారుజామున దిగారు. ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు. నకరికల్లు మండలం శాంతినగర్‌ సమీపంలోకి రాగానే రెండు బైకులపై ఉన్న ఆరుగురు యువకులు వెంబడించి దంపతులతో అకారణంగా వాగ్వాదానికి దిగారు. రాయితో భారతి తలపై మోదారు. ఆమె మెడలోని 35 గ్రాముల బంగారు నానుతాడు, రామకృష్ణ వద్ద సెల్‌ఫోన్‌ కాజేసి పరారయ్యారు. బాధితులను నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించినట్లు నకరికల్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు ముందు తిరుమల వెళ్లి మధ్యరాత్రి సత్తెనపల్లి రైల్వేస్టేషన్‌లో దిగి నడుచుకుంటూ వస్తున్న వారి నుంచి ఆరుగురు యువకులు రూ.5 వేల నగదు, చేతి గడియారం తీసుకెళ్లారు. ఈ మేరకు బాధితులు పోలీసులను ఆశ్రయించగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని