logo

బాధల్లో ఉండి.. భవిష్యత్తుకు కదిలి..

బాధల్లో ఉన్నా భవిష్యత్తు నిర్మాణం కోసం కదిలారు ఈ విద్యార్థులు. అనారోగ్యంతో చనిపోయిన తండ్రి పురుషోత్తమాచారి(48) మృతదేహం ఇంటి వద్ద ఉన్నా.. తప్పని పరిస్థితుల్లో సోమవారం

Published : 24 May 2022 03:51 IST

 
తండ్రి లేరనే బాధ దిగమింగుకొని పరీక్షకు వచ్చిన ఇడికోజు లలిత

బాధల్లో ఉన్నా భవిష్యత్తు నిర్మాణం కోసం కదిలారు ఈ విద్యార్థులు. అనారోగ్యంతో చనిపోయిన తండ్రి పురుషోత్తమాచారి(48) మృతదేహం ఇంటి వద్ద ఉన్నా.. తప్పని పరిస్థితుల్లో సోమవారం ‘పది’ పరీక్షకు హాజరయింది కొండమల్లేపల్లి మండలం చింతకుంట్లకు చెందిన విద్యార్థిని ఇడికోజు లలిత. పురుషోత్తమాచారికి భార్య పుష్పలత, నీతు, లలిత, స్వీటీ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె దివ్యాంగురాలవడం, రెండో కుమార్తె పరీక్షలు రాస్తుండటంతో చిన్న కుమార్తె స్వీటీ తండ్రికి తలకొరివి పెట్టడం స్థానికులను కలిచి వేసింది.

* వారం క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చివరకు పరీక్ష కేంద్రానికి చేరుకోని స్థితుల్లో విద్యాధికారుల అనుమతితో అంబులెన్స్‌లోనే ఉండి పరీక్ష రాశాడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం సజ్జాపురంతండాకు చెందిన బానావత్‌ గౌతమ్‌.

* క్యాన్సర్‌తో పోరాడుతున్న దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన అల్లం మహేశ్‌ అడవిదేవులపల్లి మండల కేంద్రంలో పదో తరగతి పరీక్ష రాశారు. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.


అంబులెన్స్‌లో ఉండి పరీక్ష రాసిన బానావత్‌ గౌతమ్‌

- కొండమల్లేపల్లి, మిర్యాలగూడ, అడవిదేవులపల్లి, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని