logo

ఆరుబయట మృతదేహ అవయవాలు

శవ పరీక్ష నిర్వహించిన అనంతరం అవయవాలు భద్రపర్చాల్సి ఉన్నప్పటికీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో మృతుల అవయవాలు ఆరుబయటికి వచ్చాయి. ఈ ఘటన దేవరకొండ ప్రభుత్వాసుపత్రి ఆవరణలో సోమవారం వెలుగుచూసింది. దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శవ పరీక్ష నిర్వహించే అదనపు గదులను నిర్మాణం చేపడుతున్నారు.

Updated : 24 May 2022 03:53 IST

దేవరకొండ ఏరియా ఆస్పత్రి ఆవరణలో శవ పరీక్ష అనంతరం బాక్సులో భద్రపర్చిన అవయవం ఇలా..

దేవరకొండ, న్యూస్‌టుడే: శవ పరీక్ష నిర్వహించిన అనంతరం అవయవాలు భద్రపర్చాల్సి ఉన్నప్పటికీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో మృతుల అవయవాలు ఆరుబయటికి వచ్చాయి. ఈ ఘటన దేవరకొండ ప్రభుత్వాసుపత్రి ఆవరణలో సోమవారం వెలుగుచూసింది. దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శవ పరీక్ష నిర్వహించే అదనపు గదులను నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక గదిలో శవ పరీక్ష నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం ఆస్పత్రి ఆవరణలో శవ పరీక్ష అనంతరం భద్రపర్చిన అవయవాలు ఆరుబయట ఆస్పత్రి సిబ్బందికి, స్థానికుల కంటపడడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కడే పందులు, కుక్కలు సంచరిస్తుండడంతో వాటి పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. శవ పరీక్ష గది నిర్మాణం దృష్ట్యా బాక్సులను తరలిస్తున్న క్రమంలో కుక్క ఎత్తుకెళ్లి ఉంటుందని వైద్య సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు.

కీలక ప్రక్రియలో నిర్లక్ష్యం

దేవరకొండ డివిజన్‌ పరిధిలో తరచుగా జరిగే ఆత్మహత్యలు, అరుదుగా జరిగే హత్యలపైన, అనుమానాస్పద మృతిపై శవాలకు సంబంధించిన ఆయా అవయవాలను శవ పరీక్షలో తీసి బాక్సుల్లో భద్రపరుస్తారు. పోలీసులకు అందిన ఫిర్యాదుతో వైద్య సిబ్బంది వారికి ఆ అవయవాలను అందజేస్తారు. తదనంతరం పోలీసులు వాటిని హైదరాబాద్‌, తదితర ప్రాంతాల్లోని ల్యాబ్‌లకు పంపుతారు. అనంతరం వచ్చిన రిపోర్టుల ఆధారంగా నిజ నిర్ధారణ జరుగుతుంది. ఇలాంటి కీలక ప్రక్రియలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం తగదంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


తాత్కాలిక శవ పరీక్ష గది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని