logo

నిధిరాత అంతంతే..

ప్రభుత్వ పథకాలపై కర్షకులకు అవగాహన లేక దూరమవుతున్నారు. పెట్టుబడి సాయం కింద వచ్చే సొమ్మును సన్న, చిన్న కారు రైతులు కోల్పోతున్నారు. వారిని చైతన్య పరచడంలో అధికారులు విఫలమవుతుండటంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది. కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో ఈకేవైసీ నమోదులో చాలా వెనుకబాటుతనం కనిపిస్తోంది. ఈ నెలాఖరులోపు ప్రక్రియ పూర్తి చేయకుంటే పెట్టుబడి సాయానికి దూరమవుతారు.

Updated : 24 May 2022 04:09 IST


నల్గొండలోని మీసేవ కేంద్రంలో వివరాలు నమోదు చేసుకుంటున్న రైతు

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పథకాలపై కర్షకులకు అవగాహన లేక దూరమవుతున్నారు. పెట్టుబడి సాయం కింద వచ్చే సొమ్మును సన్న, చిన్న కారు రైతులు కోల్పోతున్నారు. వారిని చైతన్య పరచడంలో అధికారులు విఫలమవుతుండటంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది. కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో ఈకేవైసీ నమోదులో చాలా వెనుకబాటుతనం కనిపిస్తోంది. ఈ నెలాఖరులోపు ప్రక్రియ పూర్తి చేయకుంటే పెట్టుబడి సాయానికి దూరమవుతారు.

కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ేకేంద్రం ఏడాదికి రూ. 6 వేలను మూడు విడతల్లో అందిస్తోంది. ఈ పథకంలో నమోదైన రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. బోగస్‌ పేర్లతో డబ్బు కాజేశారనే ఆరోపణలు ఉండటంతో ఆర్హులను గుర్తించేందుకు దీన్ని తప్పనిసరి చేశారు. జిల్లాలో నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.


హుజూర్‌నగర్‌ మండలంలో అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు

* రైతులు చరవాణి సాయంతో నమోదు చేసుకోవచ్చు.

* పీఎం కిసాన్‌ పోర్టల్‌ ఓపెన్‌ చేసి ఆధార్‌ నంబరు రాయాలి. సెర్చ్‌ బటన్‌ నొక్కి ఆధార్‌కు అనుసంధానమైన చరవాణి సంఖ్యను నమోదు చేయాలి.

* ఆ సమయంలో ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే పరిశీలన అనంతరం ఓకే అవుతుంది.

* ఏఈవోల వద్దకు వెళ్లినా.. సొంతంగా లేదా ఏఈవోల సాయంతో ఈకేవైసీ నమోదు చేయడంతో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎక్కువ శాతం రైతులకు గతంలో చరవాణి సంఖ్య ఒకటి ఉంటే ఇప్పుడు మరొకటి ఉంది. ప్రారంభంలో ఏ నంబర్‌ ఇచ్చారో తెలియని పరిస్థితి. ఈకేవైసీ చేసేటప్పుడు ఓటీపీ నంబర్‌ దొరకడం లేదు. మీ సేవ కేంద్రానికి వెళ్లి మళ్లీ సరిచేసుకోవాల్సి వస్తుంది.

ఆధార్‌తో అనుసంధానించని వారు..

ఆధార్‌తో మొబైల్‌ అనుసంధానించని వారు, ఇతర ఇబ్బందులున్న వారు తప్పనిసరిగా సమీప మీసేవకు వెళ్లాలి. ఇక్కడ ఈకేవైసీ బయోమెట్రిక్‌ చేయించుకోవచ్ఛు ఏఏ మండలాల్లో ఎంత మంది బయోమెట్రిక్‌ పెండింగ్‌లో ఉందో ఏఈవోలు గ్రామాల్లో జాబితా ప్రదర్శిస్తున్నారు. అలాంటి వారు కేంద్రానికి వెళ్లే వారు సక్రమంగా స్పందించకపోవడం, ఇతర పనుల ఒత్తిడితో మళ్లీ మళ్లీ రమ్మనడంతో అర్హులు పథకానికి దూరమవుతున్నారు. 2019 ఫిబ్రవరి 10 వరకు పాసుపుస్తకాలు ఉన్న రైతులు మాత్రమే అర్హులని నిబంధనలు చెబుతున్నాయి. ప్రభుత్వం సూచించిన తేదీ తర్వాత కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులు ఈ పథకంలో పేర్ల నమోదుకు అనర్హులు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని