logo
Published : 24 May 2022 04:10 IST

వానాకాలం.. సాగు ప్రణాళిక

యాదాద్రి జిల్లాలో 4.75 లక్షల ఎకరాల్లో పంటల అంచనా


వరి నారుతో రైతు (పాతచిత్రం)

 

ఆలేరు, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లాలో వానాకాలం పంటల సాగుపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. జిల్లాలో సాగును అంచనా వేసి అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం ప్రణాళిక సిద్ధం చేశారు. మరో రెండు రోజుల్లో రోహిణి కార్తె ప్రారంభం అవుతుండటంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నం అవుతున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే దుక్కి పనులు ప్రారంభం కాగా మొదటి వర్షానికే విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.

పత్తి సాగే అధికం

వానాకాలంలో జిల్లాలో 4,75,280 ఎకరాల్లో పంటలను సాగు చేస్తారని జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. దీనికి అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేశారు. జిల్లాలో ప్రధాన పంటలైన వరి 1,72,500, పత్తి 2,17,800 ఎకరాలు, కంది 60,800 ఎకరాలలో ఉద్యాన వన పంటలు సుమారు 19,500 ఎకరాల్లో సాగు చేయనున్నారు.

కొరత లేకుండా చర్యలు..

జిల్లాలో మొత్తం 4,75,280 ఎకరాల్లో పంటలు సాగు కానుండగా ఇందుకు అనుగుణంగా 46,452 క్వింటాళ విత్తనాలను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. 83,497 మెట్రిక్‌ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే చాలా వరకు విత్తనాలు అందుబాటులో ఉంచగా ఈ నెలాఖరు నాటికి మిగతా విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని