logo
Published : 24 May 2022 04:10 IST

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత: మంత్రి


సూర్యాపేట: టేకుమట్లలో భేరి వాయిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ లింగయ్యయాదవ్‌, తదితరులు

పెన్‌పహాడ్‌: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పెన్‌పహాడ్‌లో సౌడమ్మ- లింగమంతుల స్వామి జాతరకు సోమవారం హాజరై పూజలు నిర్వహించారు. చారిత్రక ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సౌడమ్మ- లింగమంతుల స్వామి దేవాలయాల వద్ద సీసీ రోడ్డు, స్వాగత తోరణాన్ని మంత్రి ప్రారంభించారు. యాదవుల సంప్రదాయం ప్రకారం ఆలయ నిర్వాహకులు మంత్రికి గొర్రెపిల్లను బహూకరించి సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, డీసీఎంస్‌ ఛైర్మన్‌ వట్టె జానయ్యయాదవ్‌, ఎంపీపీ నెమ్మాది భిక్షం, తెరాస మండల అధ్యక్షుడు దొంగరి యుగంధర్‌, బొల్లక బొబ్బయ్య, సర్పంచులు బొల్లక సైదమ్మ, పరెడ్డి సీతారాంరెడ్డి, చెన్ను శ్రీనివాస్‌రెడ్డి, తూముల ఇంద్రసేనారావు, పొదిల నాగార్జున, కోఆప్షన్‌ సభ్యుడు రఫీ, అనంతుల శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీటీసీ సభ్యుడు నాగునాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేట గ్రామీణం: టేకుమట్లలో సౌడమ్మ, లింగమంతులస్వామి, పెద్దమ్మతల్లి, ఎల్లమ్మతల్లి పండుగకు భక్తులు భారీగా తరలివచ్చారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ లింగయ్యయాదవ్‌, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ వట్టె జానయ్యయాదవ్‌, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు, టీపీసీసీ కార్యదర్శి పటేల్‌ రమేష్‌రెడ్డి పూజలు చేశారు. టేకుమట్ల నుంచి సౌడమ్మ దేవాలయాలకు వచ్చే రహదారి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని