logo

కిష్టరాయిన్‌పల్లి పనుల వద్ద పోలీసుల మోహరింపు

కిష్టరాయిన్‌పల్లి జలాశయం పనులు జరుగుతున్న ప్రాంతానికి మంగళవారం పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఈ జలాశయం పరిధిలో ముంపునకు గురవుతున్న నాంపల్లి మండలం

Published : 25 May 2022 02:49 IST

లక్ష్మణాపురం వద్ద కిష్టరాయిన్‌పల్లి ప్రాజెక్టు ప్రాంతంలో మోహరించిన పోలీసులు

నాంపల్లి, న్యూస్‌టుడే: కిష్టరాయిన్‌పల్లి జలాశయం పనులు జరుగుతున్న ప్రాంతానికి మంగళవారం పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఈ జలాశయం పరిధిలో ముంపునకు గురవుతున్న నాంపల్లి మండలం లక్ష్మణాపురం భూ నిర్వాసితులు నిర్మాణ పనులు అడ్డుకుంటున్న విషయం విదితమే. పనులు నిలిపివేసినట్లు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఎదుట ప్రభుత్వం అంగీకరించినప్పటికీ పోలీసు బలగాలను ఏర్పాటు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కిష్టరాయిన్‌పల్లి జలాశయం ఈఈ ఎలమందయ్యను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా పనులు కొనసాగడం లేదన్నారు. దేవరకొండ డీఎస్పీ నాగేశ్వరరావును వివరణ కోరగా.. భూ నిర్వాసితులు పనులు అడ్డుకుంటున్నారనే అధికారుల సూచన మేరకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మర్రిగూడ: చర్లగూడెం జలాశయం పరిధిలోని భూ నిర్వాసితుల నిరసనలు మంగళవారం నాటికి 13వ రోజుకు చేరుకున్నాయి. నిరసన దీక్షలను తహసీల్దార్‌ సంఘమిత్ర, ఎస్సై వెంకట్‌రెడ్డి సందర్శించి, నిర్వాసితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. జూన్‌ 1 తర్వాత చెక్కులు పంపిణీ చేస్తామని తహసీల్దార్‌ హామీ ఇచ్చారు. అయినప్పటికీ తమ నిరసన విరమించేది లేదని నిర్వాసితులు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని