logo

సీఎంఆర్‌ బియ్యం ఇవ్వకపోతే నిషేధమే?

ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎంఆర్‌ బియ్యం బకాయిల సేకరణకు పౌరసరఫరాల శాఖ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఎన్ని గడువులు పెంచినా ఇప్పటి వరకు బియ్యం

Updated : 25 May 2022 04:47 IST

మిల్లుల్లో సీఎంఆర్‌ బియ్యం

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎంఆర్‌ బియ్యం బకాయిల సేకరణకు పౌరసరఫరాల శాఖ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఎన్ని గడువులు పెంచినా ఇప్పటి వరకు బియ్యం అప్పగించని మిల్లులపై నిషేధం విధించాలని, క్రిమినల్‌ కేసులు పెట్టాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ఎన్ని మిల్లులపై చర్యలు తీసుకోవాలో జాబితాను రాష్ట్ర స్థాయిలో తయారు చేస్తున్నట్లు సమాచారం.

ఇటీవల మిల్లుల్లో సీఎంఆర్‌ ధాన్యం నిల్వల లెక్కలు తీశారు. కొన్నిచోట్ల నిల్వలు లేకపోవడంతో కొత్త ధాన్యాన్ని చూపించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. గత యాసంగిలో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిల్లులకు కేటాయించారు. ఇందులో దాదాపు లక్ష మెట్రిక్‌ టన్నులు బకాయిలు ఉన్నట్లు సమాచారం. గత యాసంగి సీఎంఆర్‌ ధాన్యం తీసుకుని బియ్యం ఇవ్వని మిల్లర్లు సూర్యాపేట జిల్లాలోనే అధికంగా ఉన్నట్లు సమాచారం. సూర్యాపేట, నేరేడుచర్ల, కోదాడ ప్రాంతాల్లో ఉన్న కొందరు మిల్లర్లు పెద్ద మొత్తంలో సీఎంఆర్‌ బియ్యం బకాయిలు ఉన్నట్లు సమాచారం. మిల్లుల వారి లెక్కలతో కొందరు మిల్లర్లు బియ్యం బకాయిలు పెట్టినట్లు అధికారులు చెబుతున్నా మిల్లర్ల నుంచి రావాల్సి స్పందన లేకపోవటంతో ఇక కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం.

12 నుంచి 17 మిల్లులపై నిషేధం: విశ్వసనీయ సమాచారం మేరకు ఉమ్మడి జిల్లాలో 12 నుంచి 17 మిల్లులపై నిషేధం విధించే అవకాశముంది. వీరిపై క్రిమినల్‌ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వీరు ఎన్ని గడువులు పెంచి బియ్యం పెట్టాలని నోటీసులు ఇచ్చినా పెద్దగా స్పందించటం లేదని తెలిసింది. ప్రస్తుతం పెంచిన గడువు మరో వారంలో ముగియనుండటంతో అధికారుల మిల్లులపై నిషేధం విధించేందుకు నిర్ణయించారు. క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని నిర్ణయించటంతో రైస్‌ మిల్లర్ల వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని