logo

జిల్లా కోర్టు ప్రారంభానికి ఏర్పాట్లు ముమ్మరం

సూర్యాపేటలో జూన్‌ 2న జిల్లా కోర్టును ప్రారంభించనున్నారు. భవనాలు, ఇతర సౌకర్యాల పరిశీలన నిమిత్తం ఉమ్మడి నల్గొడ జిల్లా ప్రధాన న్యాయమూర్తి

Published : 25 May 2022 02:49 IST

సూర్యాపేట: కోర్టు నూతన భవనాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలిస్తున్న

జిల్లా ప్రధాన న్యాయమూర్తి జగ్జీవన్‌కుమార్‌, తదితరులు

సూర్యాపేట న్యాయవిభాగం, న్యూస్‌టుడే: సూర్యాపేటలో జూన్‌ 2న జిల్లా కోర్టును ప్రారంభించనున్నారు. భవనాలు, ఇతర సౌకర్యాల పరిశీలన నిమిత్తం ఉమ్మడి నల్గొడ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జగ్జీవన్‌కుమార్‌ సూర్యాపేటకు మంగళవారం వచ్చారు. బార్‌ అసోసియేషన్‌ తరఫున న్యాయమూర్తికి స్వాగతం పలికారు. అనంతరం ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్ష జరిపారు. ఇప్పటికే ఉన్న భవనాలలో అవసరమయ్యే మార్పులు, చేర్పులపై సంబంధిత అధికారులతో చర్చించి సూచనలు చేశారు. సూర్యాపేట కోర్టుల పరిధిలోకి వచ్చే కేసుల బదిలీకి ఏర్పాట్లు పూర్తయినట్లు న్యాయమూర్తి తెలిపారు. సూర్యాపేట అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి జె.ప్రశాంతి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు గోండ్రాల అశోక్‌, ఎస్‌.సోమేశ్వర్‌, అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, చివ్వెంల తహసీల్దారు రంగారావు, ఆర్‌అండ్‌బీ డీఈ మహిపాల్‌రెడ్డి, ఈఈ యాకూబ్‌, తదితరులు పాల్గొన్నారు.

నూతన భవనాల నిర్మాణానికి స్థల పరిశీలన... సూర్యాపేటలో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణానికి అవసరమైన స్థలాలను ప్రధాన న్యాయమూర్తి జగ్జీవన్‌కుమార్‌ పరిశీలించారు. జిల్లా కోర్టు భవనాల నిర్మాణానికి చివ్వెంల మండలం కుడకుడ సమీపంలో ప్రభుత్వ భూములను పరిశీలించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కొత్తగా ఏర్పాటయ్యే జిల్లా కోర్టులకు పూర్తిస్థాయిలో కొత్త భవనాలు నిర్మించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని