logo

ఉద్రిక్తతల నడుమ ఇళ్ల కూల్చివేత

హుజూర్‌నగర్‌ పట్టణంలోని లింగగిరి మేజర్‌పై ఉన్న పేదల ఇళ్ల తొలగింపు కార్యక్రమం మంగళవారం ఉద్రిక్తతలకు దారి తీసింది. కాల్వ వెంట అక్రమంగా నిర్మించుకున్న ఇళ్ల

Published : 25 May 2022 02:49 IST

కోదాడ రహదారిలో లింగగిరి మేజరు కాల్వపై ఉన్న పక్కా భవనాలు కూల్చివేత

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: హుజూర్‌నగర్‌ పట్టణంలోని లింగగిరి మేజర్‌పై ఉన్న పేదల ఇళ్ల తొలగింపు కార్యక్రమం మంగళవారం ఉద్రిక్తతలకు దారి తీసింది. కాల్వ వెంట అక్రమంగా నిర్మించుకున్న ఇళ్ల తొలగింపు కార్యక్రమం కోసం మూడ్రోజులుగా పోలీసు, పురపాలిక, రెవెన్యూ శాఖలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పోలీసులను పెద్ద సంఖ్యలో ముందుగానే రప్పించారు. ఆరు జేసీబీలు పురపాలక సిబ్బందిని మోహరించి కూల్చివేత పనులు ప్రారంభించారు. ఆరు విభాగాలుగా విభజించి కూల్చివేత పనులు ప్రారంభించారు. కాల్వ సెంటర్‌ నుంచి 70 అడుగుల దూరం వరకు ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు దాదాపు 360 ఇళ్ల వరకు కూల్చివేశారు. ఎలాంటి నష్టపరిహారం, ప్రత్యామ్నాయం చూపకుండా ఎలా కూల్చివేస్తారని బాధితులు ప్రశ్నించారు. ఇంట్లో సామగ్రి తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని పలువురు కోరారు. వారికి పుర సిబ్బంది సర్దుకొనే విషయంలో సాయం అందించారు.

అంతా గందరగోళం... ఒకేసారి ఆరు ప్రాంతాల్లో కూల్చివేత ప నులు చేపట్టడంతో బాధితులు ఎటూ పోలేని పరిస్థితి. అందుబాటులో ఉన్న అధికారులతో వాగ్వాదానికి దిగినా ప్రయోజనం లేకపోవడంతో తమ సామగ్రి భద్రం చేసుకోవడంలో బాధితులు నిమగ్నమయ్యారు. మిర్యాలగూడ రహదారిలో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్‌, కౌన్సిలర్‌ జక్కుల వీరయ్య కూల్చి వేత పనులు అడ్డగించే ప్రయత్నం చేశారు. వారికి మద్దతుగా బాధితులు కూడా కదిలే క్రమంలో కొంత ఉద్రిక్తత చోటుచోసుకుంది. కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. చివరకు నాగన్నగౌడ్‌, జక్కుల వీరయ్యతోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని గరిడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కూల్చివేత పనులు ముమ్మరమయ్యాక విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని