logo

ట్రాక్టర్‌ కిందపడి ఒకరి దుర్మరణం

గడ్డి తోలేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కిందపడి దుర్మరణం పాలైన ఘటన పందిబండతండాలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు

Published : 26 May 2022 02:23 IST

తావుర్యానాయక్‌

చివ్వెంల, న్యూస్‌టుడే: గడ్డి తోలేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కిందపడి దుర్మరణం పాలైన ఘటన పందిబండతండాలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన గుగులోతు తావుర్యా (55) గడ్డి తోలేందుకు వ్యవసాయక్షేత్రానికి వెళ్లారు. గడ్డిని తరలించేందుకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్‌ వెనుక నిల్చున్నారు. గమనించని డ్రైవర్‌ ఇంజిన్‌ స్టార్ట్‌ చేసే క్రమంలో క్లచ్‌ తొక్కగా ఒక్కసారిగా ట్రాక్టర్‌ వెనుక్కు వచ్చింది. ట్రాక్టర్‌ తొట్టి ఢీకొట్టడంతో కిందపడిన తావుర్యా అక్కడికక్కడే మృతిచెందారు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై పి.విష్ణు తెలిపారు.


ప్రమాదవశాత్తు మహిళ మృతి

పద్మ

భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌టుడే: పొట్టకూటి కోసం వలస వచ్చిన మహిళా కూలీ ప్రమాదవశాత్తు మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని పిలాయిపల్లి గ్రామంలోని మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. చౌటుప్పల్‌ గ్రామీణ సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మందగట్ల గ్రామానికి చెందిన చెవిటి పద్మమ్మ(48), భర్త నర్సింహ, పిల్లలతో కలిసి ఏడు నెలల నుంచి బీఎస్‌సీపీఎల్‌ పరిశ్రమలోనే ఉంటూ కూలీ పని చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం సిమెంట్‌ దిమ్మెలను పద్మమ్మ నీటితో క్యూరింగ్‌ చేస్తున్నారు. పక్కనే క్రేన్‌తో పైవంతెన దిమ్మెలను ఎత్తుతుండగా.. తీగ తెగిపోవడంతో దిమ్మె పద్మకాలుపై పడింది. ఆమె ఒక్కసారిగా కుప్పకూలడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. భర్త నర్సింహ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటయ్య తెలిపారు. పరిశ్రమలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రమాదం జరిగిందని, బాధ్యులైన యాజమాన్యం, క్రేన్‌ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని