logo

నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

మండలంలోని సికిందర్‌నగర్‌లో నకిలీ పత్తి విత్తనాలను విజిలెన్స్‌ సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో బుధవారం విజిలెన్స్‌, వ్యవసాయాధికారులు పట్టుకున్నారు. గ్రామంలో ముగ్గురు

Updated : 26 May 2022 02:24 IST

మోటకొండూరు: సికిందర్‌నగర్‌లో పట్టుకొన్న నకిలీ పత్తి విత్తనాలు,

నిందితుల(కూర్చున్న వారి)తో విజిలెన్స్‌ అధికారులు

మోటకొండూరు, న్యూస్‌టుడే: మండలంలోని సికిందర్‌నగర్‌లో నకిలీ పత్తి విత్తనాలను విజిలెన్స్‌ సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో బుధవారం విజిలెన్స్‌, వ్యవసాయాధికారులు పట్టుకున్నారు. గ్రామంలో ముగ్గురు వ్యక్తుల వద్ద అనుమానిత పత్తి విత్తనాలు ఉన్నట్లు సమాచారం అందడంతో పలు ఇళ్లల్లో తనిఖీలు జరిపారు. కర్ణాటకకు చెందిన కె.వెంకటేశ్వర్లు వద్ద నుంచి సికిందర్‌నగర్‌కు చెందిన సీహెచ్‌.అమరేష్‌ 90 కిలోల హెచ్‌టీ పత్తి విత్తనాలను కొనుగోలు చేసినట్లు తేలిందని సీఐ తెలిపారు. వీటిలో అదే గ్రామానికి చెందిన బంధనాథం రాజుకు 20 కిలోలు, బంధనాథం శౌరీకి పది కిలోల విత్తనాలను అమరేష్‌ తక్కువ ధరకు అమ్మినట్లు గుర్తించామన్నారు. అమరేష్‌, రాజు, శైరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏవో సుజాత, ఎస్సై ఎస్కే.గౌస్‌, వ్యవసాయ, విజిలెన్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని