logo

దోపిడీ ప్రభుత్వాన్ని తరిమికొట్టండి: ఉత్తమ్‌

రాష్ట్రంలో నడుస్తున్న దోపిడి ప్రభుత్వాన్ని తరమి కొట్టాలని ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం హుజూర్‌నగర్‌

Published : 26 May 2022 02:23 IST

వేపలసింగారంలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

వేపలసింగారం,(హుజూర్‌నగర్‌ గ్రామీణం), గరిడేపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో నడుస్తున్న దోపిడి ప్రభుత్వాన్ని తరమి కొట్టాలని ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం హుజూర్‌నగర్‌ మండలంలోని వేపలసింగారం, మర్రిగూడెం, కరక్కాయలగూడెం, బూరగడ్డ, గోపాలపురం, గరిడేపల్లి మండలం, కాచవారిగూడెంలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రైతు భరోసా యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. హుజూర్‌నగర్‌లో అవినీతి మరీ దారుణంగా ఉందన్నారు. ఇసుక, భూమి, మద్యం లాంటి అన్ని అక్రమ వ్యాపారాలు తెరాస నాయకులే చేస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్‌ 50 వేల మెజార్టీతో గెలవబోతున్నట్లు జోస్యం చెప్పారు. పేదలకు రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించిన తెరాసను మొత్తం నియోజకవర్గంలో ఎన్ని ఇళ్లు ఇచ్చారో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తుందని చెప్పారు. మండల పార్టీ అధ్యక్షుడు చక్రవీరారెడ్డి, యరగాని నాగన్నగౌడ్‌, నిజామొద్దీన్‌, సుబ్బారావు, అరుణ్‌కుమార్‌ దేశ్‌ముఖ్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని