logo

హిందువులంతా సంఘటితం కావాలి

హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలో శ్రీవీరహనుమాన్‌ విజయయాత్రను వైభవంగా నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్‌,

Published : 26 May 2022 02:23 IST

యాదగిరిగుట్టలో హనుమాన్‌ విజయయాత్రలో డోలు వాయిస్తున్న మహారాష్ట్ర నాసిక్‌డోల్‌ బృందం

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలో శ్రీవీరహనుమాన్‌ విజయయాత్రను వైభవంగా నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట ప్రధాన రహదారిలో కొత్త గుండ్లపల్లి నుంచి వైకుంఠద్వారం వరకు, అటు నుంచి యాదగిరిపల్లి వరకు శోభాయాత్ర చేపట్టారు. 15 అడుగుల ఆంజనేయుడు, రాముడు, శివాజీ విగ్రహాలను ట్రాక్టర్‌పై ఉంచి ఊరేగించారు. యాత్రలో కాషాయం జెండాలు రెపరెపలాడాయి. మహారాష్ట్ర నుంచి వచ్చిన నాసిక్‌డోల్‌ యువతీయువకుల బృందం వాయించిన బ్యాండ్‌ మేళాలు అలరించాయి. భక్తులు, యువకులు, మాలధారులు భక్తి పారవశ్యంతో తేలియాడుతూ, నృత్యాలు చేస్తూ.. జై రామ లక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్‌ కీ.. జై వీరాంజనేయ.. అంటూ నినాదాలతో హోరెత్తారు. వీహెచ్‌పీ రాష్ట్ర అధికార ప్రతినిధి శశిధర్‌, భాజపా జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్‌, వక్త మధుమాల్వేకర్‌, తదితరులు పాల్గొని మాట్లాడారు. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు అరికట్టాలని, యువత మేల్కొవాలని, హిందూ సమాజమంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోకల సందీప్‌, బి.శ్యాంసుందర్‌, హరీశ్‌, మహేశ్‌, ఆకుల అనిల్‌, శ్రావణ్‌, సాయినాథ్‌, ప్రవీణ్‌, శ్యామ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని