logo

గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యం

పదోతరగతి వార్షిక పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని విద్యాశాఖ జేడీ వెంకటనర్సమ్మ హెచ్చరించారు. నూతనకల్‌లో పదోతరగతి పరీక్ష కేంద్రాలను రాష్ట్రంలో గ్రామీణస్థాయిలో క్రీడలను అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని గ్రామీణ పంచాయతీరాజ్‌, రూరల్‌ అభివృద్ధి శాఖ రాష్ట్ర కమిషనర్‌ శరత్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ

Published : 26 May 2022 02:27 IST

జలాల్‌పురంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్న గ్రామీణ పంచాయతీరాజ్‌,

రూరల్‌ అభివృద్ధి శాఖ రాష్ట్ర కమిషనర్‌ శరత్‌కుమార్‌

భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో గ్రామీణస్థాయిలో క్రీడలను అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని గ్రామీణ పంచాయతీరాజ్‌, రూరల్‌ అభివృద్ధి శాఖ రాష్ట్ర కమిషనర్‌ శరత్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా రూపొందించిన గ్రామీణ తెలంగాణ క్రీడా ప్రాంగణం కార్యక్రమంలో భాగంగా మండలంలోని జలాల్‌పురం గ్రామంలో ఎంపిక చేసిన ఎకరం స్థలాన్ని కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి బుధవారం పరిశీలించారు. క్రీడా ప్రాంగణంలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌, లాంగ్‌జంప్‌, సింగిల్‌ బార్‌, డబుల్‌బార్‌ ఆటల నిర్వహణకు కోసం ప్రభుత్వం మైదానాలను ఏర్పాటుచేస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 2న ప్రాంగణాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. జలాల్‌పురం గ్రామంలోని మైదానాన్ని ఆదర్శ క్రీడాప్రాంగణంగా రూపొందించే దిశగా కృషిచేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ ప్రసాద్‌, డీఆర్డీవో ఉపేందర్‌, అదనపు డీఆర్డీవో నాగిరెడ్డి, డీపీవో సునంద, డీఎల్పీవో సాధన, ఎంపీడీవో బాలశంకర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని