logo

వైద్యుల ఆందోళన.. విరమణ

నల్గొండ జనరల్‌ ఆసుపత్రి ప్రిన్సిపల్‌ రాజకుమారి వైఖరికి నిరసనగా గురువారం ఆసుపత్రి ప్రాంగణంలో వైద్యులు ఆందోళన నిర్వహించారు. నల్ల బ్యాడీ…్జలు ధరించి ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సెలవు రోజుల్లో కూడా

Published : 27 May 2022 03:06 IST

ప్రిన్సిపల్‌ వైఖరిపై జనరల్‌ ఆసుపత్రి ప్రాంగణంలో నిరసన తెలుపుతున్న వైద్యులు

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: నల్గొండ జనరల్‌ ఆసుపత్రి ప్రిన్సిపల్‌ రాజకుమారి వైఖరికి నిరసనగా గురువారం ఆసుపత్రి ప్రాంగణంలో వైద్యులు ఆందోళన నిర్వహించారు. నల్ల బ్యాడీ…్జలు ధరించి ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సెలవు రోజుల్లో కూడా విధులు నిర్వహించాలని 56 మంది వైద్యులకు శ్రీముఖాలు ఇవ్వడం సరికాదని చెప్పారు. వైద్యులు నిర్వర్తించే ప్రతి పనిలో ఆమె జోక్యం చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వాపోయారు. బయోమెట్రిక్‌ వేసిన వారికి కూడా వేతనాల్లో కోతలు విధిస్తూ వేధింపులకు పాల్పడడం విచారకరమని చెప్పారు. వైద్యులకు ఇచ్చిన శ్రీముఖాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పరిపాలన విభాగంపై అనుభవం లేని కారణంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని కోరారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. కాగా, వైద్యులకు ఇచ్చిన శ్రీముఖాలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రిన్సిపల్‌ రాజకుమారి చెప్పడంతో నిరసన తాత్కాలికంగా విరమించారు. ఆసుపత్రిలో జరిగిన నిరసనకు రాష్ట్ర వైద్యుల టీచింగ్‌ సంఘం నాయకులు అన్వర్‌, తిరుపతిరావు, కిరణ్‌, కృష్ణప్రసాద్‌, సూర్యాపేట సంఘం నాయకులు కిరణ్‌, గిరిధర్‌, మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు బాబురావు, శ్రీధర్‌, స్వర్ణలత మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యుల సంఘం నాయకులు యుగేందర్‌, నగేష్‌, సురేష్‌, పార్థసారథి, ఇందిరా ప్రియదర్శిణి, కవిత, అనిత, తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు