logo

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం: ఉత్తమ్‌

వచ్చే ఎన్నికల్లో తెరాసను గద్దె దించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా హుజూర్‌నగర్‌, గరిడేపల్లి మండలాల్లో రైతు భరోసా

Published : 27 May 2022 03:06 IST

లింగగిరిలో మాట్లాడుతున్న ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్‌ గ్రామీణం, గరిడేపల్లి, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో తెరాసను గద్దె దించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా హుజూర్‌నగర్‌, గరిడేపల్లి మండలాల్లో రైతు భరోసా యాత్ర నిర్వహించారు. లక్కవరం, శ్రీనివాసపురం, అమరవరం, అంజలీపురం, లింగగిరి, సీరాంపురం, గరిడేపల్లి మండలం సర్వారం గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించి, మాట్లాడారు. కేసీఆర్‌ గద్దె నెక్కిన దగ్గర్నుంచి ప్రజల్ని మోసం చేసే పనిలో నిమగ్నమయ్యారని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి ఊసే మరిచారని పేర్కొన్నారు. కౌలు రైతు క్షేమం కోరి తెచ్చిన చట్టాన్ని రద్దు చేసి రైతుల పాపాన్ని మూటగట్టుకున్నారన్నారు. పేదలకు రెండు పడక గదుల  ఇళ్ల పంపిణీ కూడా చేయలేని అసమర్థ ప్రభుత్వం నడుపుతున్న తెరాస పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పలువురు ఎంపీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయా కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, పట్టణ, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని