logo

దేశాంతరాలు దాటిన తండ్రీకొడుకుల ప్రతిభ

సౌత్‌ఏషియన్‌ గేమ్స్‌-2022లో తెలంగాణ తండ్రీకొడుకులు మళ్లీ సత్తా చాటారు. ఈనెల 25నుంచి 28వరకు థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన పోటీల్లో భారత్‌ తరఫున పాల్గొన్న తండ్రీ కొడుకులు మేకల భాస్కర్‌రెడ్డి(అథ్లెటిక్స్‌), మేకల అభినయ్‌రెడ్డి(బ్యాడ్మింటన్‌ అండర్‌ 17)

Published : 29 May 2022 06:03 IST

సాధించిన పతకాలు, ధ్రువపత్రాలతో తండ్రీ కొడుకులు అభినయ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, క్రీడల నిర్వాహకులు

గుర్రంపోడు, న్యూస్‌టుడే: సౌత్‌ఏషియన్‌ గేమ్స్‌-2022లో తెలంగాణ తండ్రీకొడుకులు మళ్లీ సత్తా చాటారు. ఈనెల 25నుంచి 28వరకు థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన పోటీల్లో భారత్‌ తరఫున పాల్గొన్న తండ్రీ కొడుకులు మేకల భాస్కర్‌రెడ్డి(అథ్లెటిక్స్‌), మేకల అభినయ్‌రెడ్డి(బ్యాడ్మింటన్‌ అండర్‌ 17) బంగారుపతకాలు సాధించారు. అండర్‌-45 విభాగంలో వివిధ దేశాల నుంచి 11మంది పాల్గొన్న ఈ పోటీల్లో భారత్‌ తరఫున పాల్గొన్న భాస్కర్‌రెడ్డి వందమీటర్ల పరుగుపందెెంలో తన సమీప ప్రత్యర్థి కన్నా 2.2 సెకన్ల తక్కువ వ్యవధిలో లక్ష్యం చేరారు. భాస్కర్‌రెడ్డి 13.1 సెకన్లలో 100 మీటర్ల లక్ష్యం చేరుకోగా, ప్రత్యర్థి థాయిలాండ్‌ ఆటగాడు 15.3 సెకన్లలో లక్ష్యం చేరుకున్నాడు. బ్యాడ్మింటన్‌ అండర్‌-17 విభాగంలో  మేకల అభినయ్‌రెడ్డి థాయిలాండ్‌ ఆటగాడితో పోటీపడిన బెస్ట్‌ ఆఫ్‌ 3లో రెండు ఆటలు (21-17, 21-14 ) పాయింట్ల తేడాతో గెలుపొందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని