logo

సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం

యాదాద్రీశుడిని దర్శించుకోవడానికి శనివారం యాదగిరిగుట్టకు వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌కు ఉమ్మడి జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి జ్ఞాపిక అందజేసి,

Published : 29 May 2022 06:03 IST

యాదగిరిగుట్టలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌


ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌కు జ్ఞాపిక అందజేస్తున్న న్యాయవాదులు

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: యాదాద్రీశుడిని దర్శించుకోవడానికి శనివారం యాదగిరిగుట్టకు వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌కు ఉమ్మడి జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి జ్ఞాపిక అందజేసి, సన్మానించారు. ఈ సందర్భంగా ఇక్కడి కోర్టులు ఎలా ఉన్నాయి, పనితీరు ఎలా ఉంది, తదితర న్యాయ సంబంధించిన అంశాలపై ఆయన చర్చించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా న్యాయమూర్తి జగ్జీవన్‌కుమార్‌, ఐదో అదనపు జిల్లా న్యాయమూర్తి కె.కుషా, జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ కార్యదర్శి వేణు, భువనగిరి సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి రజని, ఆలేరు జూనియర్‌ సివిల్‌ కోర్టుల న్యాయమూర్తి సుమలత, భువనగిరి అదనపు జూనియర్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కవిత, డీసీపీ నారాయణరెడ్డి, ఆలేరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సుదగాని శ్రీహరి, న్యాయవాదులు స్వామి, సంతోష, రాజిరెడ్డి, వనం రాజు, హరికృష్ణ, వీరస్వామి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని