logo

జూన్‌ చివరికల్లా బడుల్లో పనులు పూర్తి కావాలి

మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జూన్‌ చివరికల్లా మండలానికి రెండు పాఠశాలలను ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా నిర్దేశించిన సమయానికి అన్ని హంగులతో సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి ఆదేశించారు.

Published : 29 May 2022 06:03 IST

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి, పక్కన అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌

సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే: మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జూన్‌ చివరికల్లా మండలానికి రెండు పాఠశాలలను ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా నిర్దేశించిన సమయానికి అన్ని హంగులతో సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి ఆదేశించారు. సంబంధిత అధికారులు, ఇంజనీర్లతో శనివారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపికైన పాఠశాలల్లో ప్రభుత్వ ప్రాధాన్యం గుర్తించి పనులను వేగవంతం చేయాలన్నారు. మండలాల్లో గుర్తించిన పాఠశాలల్లో మరమ్మతులు, ఇతర పనులకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈజీఎస్‌ ద్వారా చేపట్టే పనులకు, మన ఊరు-మన బడి పథకం ద్వారా చేపట్టే పనులకు వేర్వేరుగా ప్రతిపాదనలు ఉండాలని, చెల్లింపులు కూడా అదే విధంగా జరగాలని సూచించారు. సోమవారం నుంచి పనులు ప్రారంభం కావాలని, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలన్నారు. పనులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, పీఆర్‌ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈలు రమేశ్‌, మనోహర్‌, ప్రభాకర్‌, వెంకటేశ్వర్లు, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని