logo

అరాచక శక్తులను అడ్డుకోండి: ఎంపీ ఉత్తమ్‌

అభివృద్ధిని విస్మరించి అరాచకాలకు పాల్పడుతున్న తెరాస శ్రేణులకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. మట్టపల్లిలో శనివారం నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు

Published : 29 May 2022 06:03 IST

మట్టపల్లిలో ఏర్పాటు చేసిన రైతు రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మఠంపల్లి, న్యూస్‌టుడే: అభివృద్ధిని విస్మరించి అరాచకాలకు పాల్పడుతున్న తెరాస శ్రేణులకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. మట్టపల్లిలో శనివారం నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు భూకబ్జాలకు పాల్పడడంతో పాటు అందినంత దోచుకునేందుకు అలవాటు పడ్డారని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తమ పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని అలాంటి వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మఠంపల్లి మండలంలో ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. నిరుపేద మత్స్యకారులను కృష్ణానదిలో చేపలు పట్టవద్దని బెదిరిస్తున్నారని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా, ప్రస్తుతం ఎంపీగా ఉన్నానని తానెప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు. సమావేశానికి ముందు లక్ష్మీనృసింహుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. రామచంద్రాపురంతండా, భీమ్లతండా, గుర్రంబోడు తండా, కృష్ణతండా, సుల్తాన్‌పూర్‌తండాలలో ఉత్తమ్‌ ప్రసంగించారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు సాముల శివారెడ్డి, రామిశెట్టి అప్పారావు, మండల పార్టీ అధ్యక్షుడు బి.మంజీనాయక్‌ పాల్గొన్నారు.

హుజూర్‌నగర్‌: సర్పంచుల పోరాటాలకు తాను అండగా ఉంటానని వారితో కలిసి పోరాడుతానని ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం హుజూర్‌నగర్‌ ఎంపీ క్యాంపు కార్యాలయం నుంచి పార్లమెంటు స్థాయిలో సర్పంచులు, మండల పార్టీ అధ్యక్షుల జూమ్‌ సమావేశంలో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని