logo

భక్తులకు ఇబ్బంది కలగొద్దు

ప్రముఖ పుణ్యక్షేత్రం చెర్వుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు పాలక మండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

Published : 29 May 2022 06:03 IST

చెర్వుగట్టులో జరుగుతున్న పనులను పరిశీలిస్తున్న కమిషనర్‌ అనిల్‌ కుమార్‌

నార్కట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రం చెర్వుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు పాలక మండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్‌ గట్టుపైన పెండింగ్‌ పనులను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఛైర్‌పర్సన్‌ మేకల అరుణా రెడ్డి, జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ సులోచన, ఇన్‌ఛార్జి ఈవో నవీన్‌ కుమార్‌, ధర్మకర్తలు శ్రీనువాస్‌, వెంకట్‌రెడ్డి, శ్రీను, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని