logo

మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం

మహిళా వ్యాపార వేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో వి-హబ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులకు ప్లేమ్‌ ఎంటర్పైమ్షిప్‌ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Published : 25 Jun 2022 05:28 IST

అవగాహన సమావేశాన్ని కాగడతో ప్రారంభిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, తదితరులు

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మహిళా వ్యాపార వేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో వి-హబ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులకు ప్లేమ్‌ ఎంటర్పైమ్షిప్‌ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళా వ్యాపార వేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో వి-హబ్‌ పూర్తిగా రాష్ట్ర ఐటీ, సీ విభాగం పరిధిలో పని చేస్తుందని తెలిపారు. మహిళల భాగస్వామ్యం ద్వారా ఆర్థిక వ్యవస్థ పురోగమించే దిశగా కృషి చేయాలని సూచించారు. వి-హబ్‌ అనేది ప్రభుత్వ ఏజెన్సీలు, పరిశ్రమలు, కార్పొరేట్‌ కంపెనీలతో కలిసి పని చేస్తుందని వివరించారు. మహిళలు తమ ఆలోచనలకు పదునుపెట్టి స్టార్టప్‌ కంపెనీల స్థాపనకు ముందుకొచ్చినట్లయితే వి-హబ్‌ ద్వారా ప్రభుత్వం సహాయక సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. టి-హబ్‌ను ప్రారంభించేందుకు ఈ నెల 28న రాష్ట్ర ఐటీ శాఖ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కార్యకమంలో వి-హబ్‌ డైరెక్టర్‌ శ్రీదేవి, మేనేజర్‌ ఆయుష్‌, పరిశ్రమ శాఖ మేనేజర్‌ భారతి, డీఈవో భిక్షపతి, గణపతిరావు, గఫూర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్‌ స్వగృహలో ప్రభుత్వమే సౌకర్యాలు కల్పిస్తుంది
నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాజీవ్‌ స్వగృహ టౌన్‌ షిప్‌లో ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అన్నారు. నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడ గ్రామంలో రాజీవ్‌ స్వగృహ శ్రీవల్లి టౌన్‌ షిప్‌ ఓపెన్‌ ప్లాట్లు, పాక్షిక నిర్మాణ గృహాలకు శుక్రవారం కలెక్టరేట్‌లో అయిదో రోజు భౌతిక వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీవ్‌ స్వగృహలో ప్లాట్లు, గృహాలను కొనుగోలు చేసేవారికి బ్యాంకు రుణ సౌకర్యం ఉందని తెలిపారు. నల్గొండ పట్టణానికి అతి సమీపంలో ఉన్న టౌన్‌షిప్‌లోని ఓపెన్‌ ప్లాట్లు చదరపు గజానికి రూ.7 వేలు, పాక్షిక నిర్మాణమైన గృహాలు నిర్మాణ దశలు అనుసరించి రూ.7 వేల నుంచి రూ. 12,500 వరకు అప్‌ సెట్‌ ధరగా నిర్ణయించినట్లు వివరించారు. రాజీవ్‌ స్వగృహ టౌన్‌షిప్‌లో ఇళ్లు, ప్లాట్లు పొందడంలో ఎలాంటి ఇబ్బంది లేదని, విశాలమైన రహదారులు కలిగి ఉన్నాయని తెలిపారు. రెండో విడత వేలంలో అయిదు రోజులకు రూ.4.14 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరినట్లు తెలిపారు. ఇంకా వేలంలో పాల్గొనదలచినవారు ప్రాజెక్టు మేనేజర్‌ షఫియుద్దీన్‌ 91543 39209 నంబరులో సంప్రదించవచ్చని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, సర్వే ల్యాండ్‌ రికార్డు ఏడీ శ్రీనివాస్‌, పశుసంవర్థక శాఖ ఏడీ శ్రీనివాస్‌ ఇతర అధికారులు, ఔత్సాహకులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని