logo

స్వయం ఉపాధికి బాటలు

నల్గొండ జిల్లా పరిషత్‌, న్యూస్‌టుడే: సృష్టిలో దాగియున్న సృజననని లోకానికి చూపిస్తుంది కళ..ఆ కళనే ఆసరాగా చేసుకొని కొందరు మహిళలు స్వయం ఉపాధికి బాటలు పర్చుకుంటున్నారు. మగవారికి దీటుగా కుటుంబ ఆర్ధికాభివృద్ధికి

Published : 25 Jun 2022 05:28 IST

నల్గొండ జిల్లా పరిషత్‌, న్యూస్‌టుడే: సృష్టిలో దాగియున్న సృజననని లోకానికి చూపిస్తుంది కళ..ఆ కళనే ఆసరాగా చేసుకొని కొందరు మహిళలు స్వయం ఉపాధికి బాటలు పర్చుకుంటున్నారు. మగవారికి దీటుగా కుటుంబ ఆర్ధికాభివృద్ధికి దోహదపడుతున్నారు. నల్గొండ, సూర్యాపేట పట్టణాలకు చెందిన ఇద్దరు మహిళలు విభిన్నతే ధ్యేయంగా మగ్గం, జర్దోషి వంటి ప్యాషన్‌ డిజైన్‌ రంగంలో రాణిస్తూ తనలో దాగియున్న సృజనని చాటుతున్నారు. ఒక్కరు ఉపాధి కల్పిస్తూ..మరొక్కరూ మహిళల ఆరోగ్యంపై నృత్యశిక్షణ నిర్వహిస్తూ ఆదాయం సముపార్జిస్తూ పలువురి మహిళలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు.

ఆరోగ్యం కన్నా ఐశ్వర్యమేమి లేదు: - ఎం.ఉమ, ఏరోబిక్స్‌ శిక్షకురాలు సూర్యాపేట
ప్రస్తుత సమాజంలో ఆరోగ్యంకంటే మించిన ఐశ్వర్యమేమిలేదు. ఇది చాలా మంది ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తున్నారు. అందుకు తగిన సాధన చేస్తున్నారు. నేను గత ఆరేళ్ల క్రితమే ముంబయిలో ఏరోబిక్స్‌లో శిక్షణ తీసుకున్నాను. నేను నేర్చుకున్న కళనే ఇతరలకు నేర్పించాలనే లక్ష్యంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మొదటగా సూర్యాపేట పట్టణంలో ఏరోబిక్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశాను. ఇప్పటికే రెండు బ్యాచులు శిక్షణ పూర్తయ్యింది. ప్రస్తుతం 45 మంది మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఆన్‌లైన్‌లో సైతం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. ఏరోబిక్‌ అంటే సంగీతం, నృత్యంతో కూడిన యోగా అని చెప్పవచ్చు. దీని ద్వారా శారీరక దేహదారుఢ్యత పెంచుకొనే అవకాశంతోపాటు, సన్నగా, నాజుకుగా, బరువు తగ్గించుకొనే అవకాశం ఉంది. శిక్షణ తరగుతల ద్వారా తన ఆరోగ్యం పదిల పర్చుకోవడంతోపాటు కుటుంబానికి ఆర్థికంగా వెసులుబాటు లభిస్తోంది. ఇప్పటి వరకు రెండు వందల మంది మహిళలకు ఆరోగ్యంపై తర్ఫీదు ఇవ్వడం జరిగింది.


ఎరోబిక్‌ శిక్షణ ఇస్తున్న శిక్షకురాలు ఎం.ఉమ
25 మందికి ఉపాధి:  మైలపురపు ధనలక్ష్మి నల్గొండ

సృజనాత్మక కళాకృతులతో కూడిన వస్త్రాలకు డిమాండ్‌ పెరిగింది. నిశ్చితార్థాలు, వివాహాలకు, సారి ఫంక్షన్లు ఇతర వేడుకలకు మహిళలు, యువతులు ప్రత్యేకంగా దస్తులు డిజైన్‌ చేయించుకుంటున్నారు. ఇలాంటి చీరలు, జాకెట్ల తయారీకి కుట్టు, మగ్గం పనుల్లో నైపుణ్యం ఉండాలి. దీనిని పదేళ్ల క్రితమే ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలిసారిగా మగ్గం వర్క్‌ పరిచియం చేసి నల్గొండలో దుకాణం ఏర్పాటు చేశాను. అందమైన ఆకృతులతో మహిళలను ఆకర్షించేలా డిజైన్‌ చేస్తూ ఆర్థికంగా బాటలు పదిలపర్చుకున్నారు. మా ఆయన కూడా పనుల్లో సహకారం అందిస్తారు. అతివల మనస్సుకు తగినట్లు మగ్గం, జర్దోషి, జరి, వర్క్‌లు చేయించడంతోపాటు జాకెట్లు కుట్టించడం జరుగుతుంది. డిజైన్‌ను అనుసరించి ఛార్జి చేస్తాం. ఏడాదికి రూ.70 లక్షల వ్యాపారం నడుస్తోంది. నిత్యం 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. అన్ని ఖర్చులు పోను ప్రతి నెలా రూ.40 నుంచి రూ. 50వేల వరకు ఆర్థిక వెసులుబాటు లభిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు