logo

ప్రాణం తీసిన కుటుంబ కలహాలు

కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన యువకుడు సెల్‌టవర్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలకేంద్రంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్‌ఐ తిరుపతి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 25 Jun 2022 05:49 IST

 సెల్‌టవర్‌ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య

ఆలకుంట శ్రీను

బెజ్జంకి, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన యువకుడు సెల్‌టవర్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలకేంద్రంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్‌ఐ తిరుపతి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన ఆలకుంట వెంకటయ్య కొన్నేళ్ల క్రితం బెజ్జంకికి వలస వచ్చి ఒడ్డెర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు  శ్రీను(23)కు మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన రాజేశ్వరితో వివాహం కాగా కూతురు(18నెలలు) ఉంది. ఏడాదిగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కుల పెద్దలు సర్ది చెప్పారు. మూడు నెలల క్రితం శ్రీను భార్య, కూతురితో కలిసి కూలీ పనికి నల్గొండకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. అయినప్పటికీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు తగ్గకపోవడంతో రాజేశ్వరి కూతురితో తల్లిగారింటికి చేరుకుంది. దీంతో నాలుగు రోజుల క్రితం బెజ్జంకికి వచ్చిన శ్రీను కులపెద్దలకు విషయం తెలిపాడు. శుక్రవారం శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయం సమీపంలో పంచాయతీ నిర్వహించి వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. అనంతరం ఎడ్లబండి కూడలిలో శ్రీనుతో అతడి మామ, మరో బంధువు గొడవ పడగా స్థానికులు అడ్డుపడి ఇళ్లకు పంపించారు. భార్య కాపురానికి రాకపోవడం, గొడవలతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీను సెల్‌ టవర్‌ ఎక్కుతుండగా బంధువులు గమనించి వారించినా వినకుండా కిందకు దూకాడు. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం అందుకున్న ఎస్‌ఐ తిరుపతి ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడి సోదరుడు నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని